News February 12, 2025
మంథని: సొమసిల్లి పడిపోయిన వృద్ధురాలు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739276740383_51751241-normal-WIFI.webp)
మంథని పట్టణం అంబేడ్కర్ చౌరస్తాలో చీర్ల శంకరమ్మ (65) వృద్ధురాలు కూరగాయలు అమ్ముకుంటూ అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయింది. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి వృద్ధురాలు మరణించినట్లు వెల్లడించారు. వృద్ధురాలిది భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కొంత కాలంగా మంథనిలో కూరగాయలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తుందని స్థానికులు చెబుతున్నారు.
Similar News
News February 12, 2025
వరంగల్ మార్కెట్లో భారీగా పతనమైన పత్తి ధర
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739334649847_1047-normal-WIFI.webp)
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు పత్తి ధర భారీగా పతనమైంది. నిన్న మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. నేడు రూ.6,950కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. ఒకరోజు వ్యవధిలోనే రూ.110 ధర తగ్గడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా అధికారులు, వ్యాపారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News February 12, 2025
శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు రద్దు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737158313401_1226-normal-WIFI.webp)
AP: మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శివ దీక్షాపరులకు ఈ నెల 19 నుంచి 23 వరకు సర్వదర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News February 12, 2025
తానూర్: రూ.5.70లక్షల నగదు పట్టివేత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739331346636_50048514-normal-WIFI.webp)
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తానూర్ మండల సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద మంగళవారం రూ.5.70లక్షల నగదు సాధనం చేసుకున్నట్లు ఏఎస్ఐ శ్యాముల్ తెలిపారు. కరీంనగర్ నుంచి మహారాష్ట్రలోని బోకర్‌కు వెళ్తున్న బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా నగదు పట్టుబడినట్లు వెల్లడించారు. నగదుకు సంబంధించి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేశామన్నారు.