News November 3, 2024
మంథని: RTC బస్సు ఢీ కొని యువతి మృతి
RTC బస్సు ఢీకొని ఓ యువతి మృతి చెందిన ఘటన HYDలోని తార్నాకలో చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై మంథనికి చెందిన యువతి మెట్టుగూడ నుంచి హబ్సిగూడ ప్రధాన రహదారిలో వెళ్తోంది. ఈ క్రమంలో రిలయన్స్ స్మార్ట్ బజారు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 5, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ కరీంనగర్ లో రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి. @ పెద్దపల్లి ప్రజా పాలన విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. @ పెగడపల్లి తాసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ మల్లాపూర్ మండలంలో చోరీకి పాల్పడిన ముగ్గురి అరెస్ట్. @ బెజ్జంకి మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆత్మహత్య. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూకంపం. @ సిరిసిల్లలో ఘనంగా ప్రజా పాలన విజయోత్సవ వేడుకలు
News December 4, 2024
రామగుండం, జైపూర్‌లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తాం: డిప్యూటీ సీఎం
రామగుండం, జైపూర్ రెండు ప్రాంతాల్లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం పెద్దపల్లి భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాటు చిన్న చిన్న ఉపాధి పనులనే పెద్దగా ప్రచారం చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, మేం 11 నెలల్లోనే 56 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ఇంకా కొన్ని క్యాలెండర్ ప్రకారం నడుస్తున్నాయన్నారు.
News December 4, 2024
పెద్దపల్లి: గ్రూప్-4 నియామక పత్రాలు అందజేసిన సీఎం
గ్రూప్-4 ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం కార్యక్రమంలో భాగంగా నియామక పత్రాలను అందజేసి వారిని అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,084 మందికి నియామక పత్రాలు అందజేశామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.