News June 23, 2024
మందమర్రిలో JCB ఢీకొని కూలీ మృతి
JCB ఢీకొని కూలీ మృతి చెందిన ఘటన మందమర్రిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్ వివరాల ప్రకారం.. చెక్ డ్యామ్ నిర్మాణ పనుల కోసం తీసుకువచ్చిన ఇసుక ట్రాక్టర్ మట్టిలో దిగబడింది. దానిని JCB సహాయంతో బయటికి లాగుతుండగా డ్రైవర్ అకస్మాత్తుగా JCBని వెనక్కు తీయడంతో నవీన్(33) అనే కూలీకి బలంగా తాకింది. తీవ్రంగా గాయపడిన నవీన్‌ను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
Similar News
News November 15, 2024
ADB: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పాలన సంబరాలు
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కే.ఆర్.కే కాలనీలో ప్రజా పాలన సంవత్సర సంబరాలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో పర్యటిస్తూ ప్రజలను కలుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటి కుటుంబ సర్వేను విజయవంతం చేసేందుకు ప్రజలు సైతం సహకరించాలని ఆయన కోరారు.
News November 15, 2024
ADB: గ్రూప్-4 ఫలితాల్లో ఆదివాసీ యువకుడి సత్తా
TGPSC విడుదల చేసిన గ్రూప్ -4 ఫలితాల్లో అదివాసీ యువకుడు సత్తాచాటారు. ADB జిల్లా సిరికొండ మండలం రాయిగూడ గ్రామానికి చెందిన మడావి నాగోరావ్ జూనియర్ అసిస్టెంట్ గా ఎంపికయ్యారు. తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయం పని చేస్తూ గ్రూప్స్ పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల కుటుంబీకులు మిత్రులు అభినందలు తెలిపారు.
News November 14, 2024
కాసిపేట మండలాన్ని విడిచి వెళ్లిన పెద్దపులి
మంచిర్యాల జిల్లా కాసీపేట మండలం ముత్యంపల్లి సెక్షన్ పరిధిలోని పెద్దధర్మారం, గురువాపూర్, చింతగూడ, మలికేపల్లి, వెంకటాపూర్ శివారులో గత 10రోజులుగా సంచరించిన పెద్దపులి తీర్యాని అడవుల్లోకి తరలి వెళ్లినట్లుగా అటవి శాఖ అధికారులు తెలిపారు. అధికారులు మాట్లాడుతూ..తీర్యాని మండలం ఏదులాపూర్ అటవీ శివారులో పులి పాద ముద్రలను అక్కడి అధికారులు కనుగొన్నట్లు వివరించారు.