News January 25, 2025

మందమర్రి: ఉత్తమ సింగరేణియన్‌గా సయ్యద్ అబ్బాస్

image

గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని మందమరి ఏరియా నుంచి ఉత్తమ సింగరేణియన్‌గా ఆర్‌కేపీ ఓసీపీ ఫోర్ మెన్ ఇన్‌ఛార్జి సయ్యద్ అబ్బాస్‌ను ఎంపిక చేసినట్లు ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ తెలిపారు. ఈనెల 26న కొత్తగూడెం ఏరియాలోని ప్రకాశం స్టేడియంలో జరగబోయే వేడుకల్లో సింగరేణి సంస్థ సీఎండీ బలరాం చేతులమీదుగా బహుమతి అందుకోనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News February 18, 2025

BREAKING: కొత్త CECగా జ్ఞానేశ్ కుమార్

image

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌(CEC)గా జ్ఞానేశ్ కుమార్ ఎంపికయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి కార్యాలయం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జ్ఞానేశ్ కుమార్ పేరు గత కొన్ని రోజులుగా అందరి నోటా నానుతుండగా ఈరోజు అధికారికంగా ప్రకటన వెలువడింది. ప్రస్తుత CEC రాజీవ్ కుమార్ పదవీకాలం రేపటితో ముగియనుంది.

News February 18, 2025

ఎండాకాలం: ఈసారి హాటెస్ట్ సిటీగా బెంగళూరు!

image

దేశంలో ఈసారి ఎండలు మండిపోతాయని, అత్యంత వేడి నగరంగా బెంగళూరు నిలవనుందని IMD అంచనా వేసింది. ఏటా వేసవిలో ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అయితే ఈసారి ఢిల్లీ కంటే బెంగళూరులోనే రికార్డ్ స్థాయి టెంపరేచర్ నమోదవుతుందని పేర్కొంది. సిలికాన్ సిటీలో ఇవాళ 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా, ఢిల్లీలో 27 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదవడం గమనార్హం.

News February 18, 2025

కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

✓ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు✓ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మార్కెట్‌లో పత్తి ధర రూ.6,900✓ శంకరపట్నం మండలంలో తాగుడుకు బానిసై ఒక వ్యక్తి ఆత్మహత్య✓ ముస్లిం ఉద్యోగుల పని వేళల్లో మార్పులు✓ రామడుగు మండలంలో పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం✓ ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో నేతలు

error: Content is protected !!