News March 19, 2025

మందమర్రి ఏరియాలో 1972కారుణ్య నియామకాలు:GM

image

మందమర్రి ఏరియాలో 40 మందికి కారుణ్య నియామకపత్రాలను ఏరియా జీఎం దేవేందర్ మంగళవారం అందజేశారు. అనంతరం జీఎం మాట్లాడుతూ.. ఏరియాలో ఇప్పటివరకు 1972 మందికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు ఇప్పించామని పేర్కొన్నారు. ఉద్యోగులు విధులకు గైర్హాజరు కాకుండా బొగ్గు ఉత్పత్తికి సహకరించాలని ఆయన సూచించారు.

Similar News

News October 15, 2025

VKB: ధాన్యం సేకరణ సజావుగా జరిగాలి: కలెక్టర్

image

ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సందర్భంగా కలెక్టర్ ఈ దిశానిర్దేశం చేశారు.

News October 15, 2025

అఫ్గాన్ ప్లేయర్లకు టాప్ ర్యాంకులు

image

ICC ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్ ప్లేయర్లు సత్తా చాటారు.
*వన్డే బౌలర్లలో రషీద్ ఖాన్‌కు నం.1 ర్యాంక్
*వన్డే ఆల్‌రౌండర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్‌కు నం.1 ర్యాంక్
*వన్డే బ్యాటర్లలో ఇబ్రహీం జర్దాన్‌కు రెండో ర్యాంక్
> మరోవైపు భారత ప్లేయర్లు కూడా ర్యాంకింగ్స్ దక్కించుకున్నారు. టెస్టు బౌలర్లలో బుమ్రా, టీ20 బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వన్డే బ్యాటర్లలో గిల్, టీ20 బ్యాటర్లలో అభిషేక్ నం.1 ర్యాంకుల్లో ఉన్నారు.

News October 15, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓ చర్ల ఏజెన్సీలో క్షుద్ర పూజల కలకలం
✓ జిల్లాలో 193 ధాన్యం కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్
✓ జూలూరుపాడు: విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి
✓ పాల్వంచ ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేసిన MLA
✓ కొత్తగూడెం: బాలికను వేధించిన వ్యక్తిపై పోక్సో కేసు
✓ చర్ల CHCలో తొలి సిజేరియన్ సక్సెస్
✓ ఇల్లందులో యూరియా కోసం రైతుల కష్టాలు
✓ అగ్ని ప్రమాదానికి భద్రాచలంలో ఇల్లు దహనం
✓ చర్ల: చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్: ASP