News February 2, 2025

మందమర్రి ఏరియాలో 91%బొగ్గు ఉత్పత్తి: GM

image

మందమర్రి ఏరియాలో జనవరి మాసానికి నిర్దేశించిన లక్ష్యానికి 91% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా GM దేవేందర్ తెలిపారు. శనివారం GMకార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత వివరాలను వివరించారు. డిసెంబర్‌తో పోలిస్తే 14,327టన్నుల బొగ్గు ఉత్పత్తి అధికంగా సాధించామన్నారు. అధికారులు, కార్మికులు సమష్టిగా కృషిచేసి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని కోరారు.

Similar News

News November 21, 2025

OTTలోకి వచ్చేసిన ‘బైసన్’

image

చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా నటించిన ‘బైసన్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మారి సెల్వరాజ్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రంలో అనుపమ, పశుపతి కీలక పాత్రలు పోషించారు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో ధ్రువ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

News November 21, 2025

ఎనుమాముల మార్కెట్ వద్ద ఫిట్స్‌తో వ్యక్తి మృతి

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్ వద్ద ఫిట్స్ వచ్చి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని దేశాయిపేటకు చెందిన చంద్రమౌళి (40)గా గుర్తించారు. మార్కెట్‌లో పనిచేసే చంద్రమౌళి ప్రతిరోజూ లాగే బైక్‌పై వస్తుండగా, మార్కెట్ ముందు ఫిట్స్ రావడంతో బండి మీద నుంచి కింద పడి మృతి చెందాడు. చంద్రమౌళికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News November 21, 2025

హ్యాపీగా ఉండాలంటే ఈ ఫుడ్స్ తినండి

image

మనల్ని ఆనందంగా ఉంచే హార్మోన్ అయిన డోపమైన్ ఆహారంలోనూ దొరుకుతుందంటున్నారు నిపుణులు. ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. బెర్రీస్, అరటిపండ్లు, నట్స్, ఫ్యాటీ ఫిష్, ప్రోబయాటిక్స్, ఓట్స్, ఆకుకూరలు, గుడ్లు, అవకాడో వంటివి ఆహారంలో చేర్చుకోవడంవల్ల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. వీటి వల్ల మూడ్ బాగుండటమే కాకుండా మెంటల్ క్లారిటీ, డిప్రెషన్ లక్షణాలు తగ్గించి ఎమోషనల్‌ హెల్త్ బావుండేలా చూస్తాయంటున్నారు నిపుణులు.