News January 17, 2025

మందమర్రి: కారుణ్య నియామకాలతో 1806 కొలువులు

image

మందమర్రి ఏరియాలో నూతనంగా ఉద్యోగాలు పొందిన 8 మంది డిపెండెంట్లకు జీఎం దేవేందర్ గురువారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏరియాలో ఇప్పటివరకు కారుణ్య నియామకాల ద్వారా 1806 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. నూతన కార్మికులు క్రమం తప్పకుండా విధులకు హాజరై అధిక బొగ్గు ఉత్పత్తికి కృషి చేయాలని కోరారు. కష్టపడి పనిచేసి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.

Similar News

News December 10, 2025

ADB: 938 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు

image

గ్రామపంచాయతీ ఎన్నికలకు జిల్లా పోలీసులతో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మొదటి విడతలో భాగంగా 6 మండలాలలో ఎన్నికలు జరగనుండగా అందులో 39 క్లస్టర్లు, 34 రూట్‌లతో 166 గ్రామాలలో 225 పోలింగ్ లొకేషన్లో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 938 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

News December 10, 2025

ADB: అన్న పైసలు వేసిన.. రేపు వస్తున్నావా..!

image

పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ గురువారం జరగనున్న విషయం తెలిసిందే. దీంతో పట్టణాల్లో ఉన్న పల్లె ఓటర్లకు సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు తెగ ఫోన్లు చేస్తున్నారు. ”అన్న ఎట్లున్నవే.. పైసలేసిన రేపు వచ్చి ఓటేయండి మీ ఓటే నా గెలుపును డిసైడ్ చేస్తుంది.. తప్పకుండా రావాలి” అని వేడుకుంటున్నారు. ఇదే అదనుగా ఓటర్లు తమ ట్రావెలింగ్, ఇతర ఖర్చులతో పాటు అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.

News December 10, 2025

ADB: 166 సర్పంచ్, 1392 వార్డ్ స్థానాలకు ఎన్నికలు

image

ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 6 మండలాల్లో 166 సర్పంచ్, 1392 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. పోలింగ్ సామగ్రి పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సరిపడినంత సిబ్బందిని నియమించడంతో పాటు వారికి శిక్షణ పూర్తి చేశామని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని వివరించారు.