News March 26, 2025
మందమర్రి: కూతురితో తండ్రి అసభ్య ప్రవర్తన

కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తండ్రిపై పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు మందమర్రి SI రాజశేఖర్ తెలిపారు. యాపల్ ఏరియాకు చెందిన సతీశ్ తన 15 ఏళ్ల కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అడ్డుకోబోయిన భార్యను చేతులు, కర్రతో బాదాడు. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు SI వెల్లడించారు.
Similar News
News April 25, 2025
VKB: బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు: అదనపు కలెక్టర్

బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్లో బాల్య వివాహల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖలతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహలను నిర్మూలించేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ సూచించారు.
News April 25, 2025
గంభీరావుపేట: అనుమానస్పదంగా ఇద్దరు మృతి

అనుమానాస్పద రీతిలో ఇద్దరు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజ సింగవరంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉల్లి శ్రీకాంత్ తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారి ఇంటికి కొద్ది దూరంలో ఉన్న చెరుకూరి రేఖ అదే ఇంట్లో మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.
News April 25, 2025
ఉగ్రదాడిని మిలిటెంట్ల దాడిగా పేర్కొన్న NYT.. US ఆగ్రహం

జమ్మూకశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని న్యూయార్క్ టైమ్స్(NYT) పత్రిక మిలిటెంట్ల దాడిగా పేర్కొంది. దీనిపై అమెరికా ప్రభుత్వం మండిపడింది. ఇండియా/ఇజ్రాయెల్ లేదా మరేచోటైనా టెర్రరిజం విషయానికి వచ్చేసరికి NYT వాస్తవాల నుంచి దూరం జరుగుతుందని ఫైరయ్యింది. ఈ మేరకు US ఫారిన్ అఫైర్స్ కమిటీ Xలో పోస్టు చేసింది. ఆ పత్రిక క్లిప్పింగ్‌లో మిలిటెంట్లుగా పేర్కొన్న భాగాన్ని కొట్టేసి టెర్రరిస్టులుగా మార్పు చేసింది.