News January 24, 2025
మందమర్రి: కేంద్రమంత్రిని కలిసిన ఎన్నికల సాధన కమిటీ సభ్యులు

మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికల సాధన కమిటీ సభ్యులు శుక్రవారం కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ జి.నగేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించి ఎన్నికల నిర్వహణకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
Similar News
News November 5, 2025
కర్నూలు జిల్లాలో SIల బదిలీలు: SP

కర్నూలు జిల్లాలో SIల బదిలీలు చేపట్టినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మంగళవారం బదిలీల ఉత్తర్వులు జారీ చేశారు. గూడూరు SI అశోక్‌ను కర్నూలు తాలూకా PSకు, SI ఎం.తిమ్మయ్యను కర్నూలు 3 టౌన్ నుంచి కర్నూలు 2 టౌన్‌కు, SI జి.హనుమంత రెడ్డిని 2 టౌన్ నుంచి గూడూరుకు, SI ఏసీ పీరయ్యను కర్నూలు తాలూకా PS నుంచి కర్నూలు 3 టౌన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News November 5, 2025
ఉసిరి దీపాన్ని ఎలా తయారుచేసుకోవాలి?

కార్తీక మాసంలో ఉసిరి దీపం పెట్టడం అత్యంత పవిత్రమైన ఆచారం. ఈ దీపాన్ని వెలిగించడానికి గుండ్రని ఉసిరికాయను తీసుకుని, దాని మధ్య భాగంలో గుండ్రంగా కట్ చేయాలి. ఆ భాగంలో స్వచ్ఛమైన నూనె లేదా ఆవు నెయ్యి వేయాలి. ఆ నూనెలో వత్తి వేసి వెలిగించాలి. ఇలా ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల సకల దేవతల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నవగ్రహ దోషాలు తొలగి ఇంట్లో సుఖశాంతులు చేకూరుతాయని భక్తుల నమ్మకం.
News November 5, 2025
ఉపరితల ఆవర్తనంతో ఈ జిల్లాల్లో వర్షాలు!

కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ APలోని కోనసీమ, కృష్ణా, GNT, బాపట్ల, ప్రకాశం, NLR, కర్నూలు, కడప, TPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు TGలో ఇవాళ్టితో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో వర్షాలు ముగుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.


