News January 24, 2025

మందమర్రి: కేంద్రమంత్రిని కలిసిన ఎన్నికల సాధన కమిటీ సభ్యులు

image

మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికల సాధన కమిటీ సభ్యులు శుక్రవారం కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ జి.నగేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించి ఎన్నికల నిర్వహణకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Similar News

News February 10, 2025

ADB: పత్తి కొనుగోళ్లు తాత్కాలికంగా బంద్

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపి వేసినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు సోమవారం తెలిపారు. రైతుల ఆధార్ వెరిఫికేషన్‌లో పలు సాంకేతిక సమస్యల రీత్యా కొనుగోళ్లు నిలిపివేసినట్లు వెల్లడించారు. తర్వాత కొనుగోళ్లు తేదీని వెంటనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ విషయమై రైతులు సహకరించాలని కోరారు.

News February 10, 2025

జీ.కోడూరు సర్పంచ్ సస్పెండ్

image

అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం జీ.కోడూరు పంచాయతీ సర్పంచ్ బొడ్డేటి అమ్మాజీ లక్ష్మినీ సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు ఎంపీడీవో సీతామాలక్ష్మి తెలిపారు. సర్పంచ్‌ని మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తూ ఉప సర్పంచ్‌కి బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.

News February 10, 2025

KMR: ‘క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి’

image

ప్రతి పోలీసు విధి నిర్వహణలో క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని పోలీసు సీనియర్ అధికారులు సూచించారు. KMR జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆదేశాల మేరకు ఇటీవల నూతనంగా నియామకమైన కానిస్టేబుల్‌లకు జిల్లా పోలీసు కార్యాలయంలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్లో విధులు ఎలా నిర్వర్తించాలి, ప్రజలతో ఎలా మెలగాలి తదితర విషయాలను కామారెడ్డి సీఐ చంద్రశేఖర్‌ వివరించారు.

error: Content is protected !!