News March 12, 2025
మందమర్రి: కేకే 5 గనిలో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు

మందమర్రి ఏరియాలోని KK 5 గని మొదటి షిఫ్ట్ లో జరిగిన ప్రమాదంలో గోలెం సాయి శివ అనే కార్మికుడు గాయపడ్డాడు. 4 సీమ్ 26 దగ్గర దిగి ఉన్న టబ్ ఎక్కించే ప్రయత్నంలో టబ్ ఫ్రేమ్‌కు రైలుకి మద్య కార్మికుడి ఇరకడంతో కుడి చేయి మధ్య వేలు తెగి పోయింది. హుటాహుటిన కార్మికుడిని రామకృష్ణాపూర్‌లోని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 8, 2026
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షకు 162 మంది గైర్హాజరు: ఆర్ఐవో

ఏలూరు జిల్లాలో ఆదివారం జరిగిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 3,454 మంది హాజరు కాగా 162 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని ఆర్ఐవో యోహాన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 23 నుంచి జరిగే థియరీ పరీక్షలు సీసీ కెమెరాల నిర్వహణలో జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాలలోకి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించమని స్పష్టం చేశారు.
News February 8, 2026
రూ.100 కోట్లతో BJPని ఓడించాలనుకుంటున్నారు: బండి

TG: MIMతో BRS, కాంగ్రెస్ లాలూచీ పడ్డాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ‘కరీంనగర్ రావడానికి రేవంత్ భయపడి ఒవైసీని పంపారు. ఇక్కడ ఎన్నికలు ఇండియా-పాక్ మ్యాచ్‌లా ఉంటాయి. MIM, కాంగ్రెస్ రహస్య మీటింగ్ పెట్టుకున్నాయి. రూ.100కోట్లు ఖర్చు పెట్టి BJPని ఓడించాలనుకుంటున్నారు. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదే. ఇక్కడ MIM గెలిస్తే ప్రజలను ఎవరూ కాపాడలేరు’ అని కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు.
News February 8, 2026
వరంగల్: టైపు రైటింగ్ లోయర్ ఎగ్జామినేషన్ ఫలితాల వెల్లడిలో తప్పులు..!

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గత సంవత్సరం డిసెంబర్ 22న నిర్వహించిన టైపు రైటింగ్ లోయర్ ఎగ్జామినేషన్ ఫలితాల వెల్లడిలో దొర్లిన తప్పులు అభ్యర్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. డిసెంబర్ 22న పరీక్షలు జరుగగా ఈనెల 7వ తేదీన విడుదల చేసిన రిజల్ట్స్‌లో మాత్రం డిసెంబర్ 23న పరీక్షలు జరిగినట్లు పేర్కొన్నారు. చాలామంది ఫెయిల్ అవ్వగా పరీక్షలపై వరంగల్లో అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేశారు.


