News April 10, 2025
మందమర్రి: పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: MP, MLA

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రజలకు వసతి హక్కు కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మందమర్రి మండలం పొన్నారంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అర్హులైన పేదలందరికీ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు.
Similar News
News December 4, 2025
గుడివాడ-కంకిపాడు రోడ్డు నిర్మాణం ప్రారంభించండి: బాలశౌరి

ఢిల్లీలోని పార్లమెంట్ హాల్‌లో CoSL ఛైర్మన్ ఎంపీ బాలశౌరితో నేషనల్ హైవే ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గుడివాడ-కంకిపాడు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, పెడన లక్ష్మీపురం రోడ్డు, తదితర పనులను ఎంపీ బాలశౌరి NHAI ఛైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఛైర్మన్ సానుకూలంగా స్పందించి, ఆ పనులను త్వరగా ప్రారంభించాలని సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.
News December 4, 2025
పోలీసుల ‘స్పందన’ లేక..

ఆకతాయి వేధింపులపై ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే తమ కుమార్తె <<18465236>>స్పందన<<>> (17) బలవన్మరణానికి పాల్పడి మరణించిందని తల్లిదండ్రులు వాపోయారు. బస్సులో యువకుడి వేధింపులపై తాము ఫిర్యాదు చేస్తే చెన్నేకొత్తపల్లి పోలీసులు పట్టించుకోలేదని, వారు సక్రమంగా వ్యవహరించి ఉంటే తమ బిడ్డను కోల్పోయేవారం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమకు కడపుకోత మిగిలిందని బోరున విలపించారు.
News December 4, 2025
ఇంటర్వ్యూతో ICSILలో ఉద్యోగాలు

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(<


