News July 8, 2024
మందమర్రి: బావిలో మృతదేహం కలకలం

మందమర్రి పట్టణంలోని దీపక్ నగర్ రైల్వే ట్రాక్ సమీపంలోని కోల్ యార్డు వద్ద బావిలో ఆదివారం యువకుని మృతదేహం గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజశేఖర్ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించారు. ఎస్సై మాట్లాడుతూ.. మృతుడు దీపక్ నగర్‌కు చెందిన సూరమల్ల ప్రణయ్(30)గా గుర్తించామని తెలిపారు. కొంత కాలంగా తాగుడుకు బానిసైన అతను బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.
Similar News
News November 30, 2025
సిరికొండ: నలుగురు మహిళా సర్పంచ్‌లు ఏకగ్రీవం

సిరికొండ మండలంలో 7గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులను గ్రామ పెద్దలు ఏకగ్రీవ తీర్మానం ద్వారా ఎన్నుకున్నారు. నేరడిగొండ (జి) క్లస్టర్‌లోని 4గ్రామపంచాయతీలకు నామినేషన్ నిర్వహించగా కుంటగూడ, జెండగూడ, నారాయణపూర్, నేరడిగోండ (జి)లో నలుగురు మహిళలను సర్పంచ్‌లుగా ఏకగ్రీవం చేశారు.

News November 29, 2025
సోమవారం ప్రజావాణి రద్దు: ఆదిలాబాద్ కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లా పరిధిలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో వచ్చే సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. కోడ్ ముగిసిన వెంటనే ప్రజావాణిని తిరిగి యథావిధిగా ఉంటుందన్నారు.