News April 29, 2024
మందమర్రి: మద్యానికి బానిసై కూలి మృతి
మందమర్రి మండలం బొక్కలగుట్టలోని ఇటుక బట్టీలో పనిచేసే ఒడిశా రాష్ట్రానికి చెందిన సురేందర్ సింగ్ అనే కూలీ మద్యానికి బానిసై మృతి చెందాడు. గత కొంత కాలంగా మద్యానికి బానిసైన మృతుడు రెండు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి ఒడిశాకు తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందాడు.
Similar News
News November 6, 2024
ADB: నేటి పత్తి ధర వివరాలు ఇవే!
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో బుధవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,521గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,030గా నిర్ణయించారు. మంగళవారం ధరతో పోలిస్తే బుధవారం సీసీఐ, ప్రైవేటు ధరలో ఎటువంటి మార్పులేదు. పత్తికి సరైన గిట్టుబాటు ధరను కల్పించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
News November 6, 2024
దిలావర్పూర్ : కులగణనను నిషేధించిన గ్రామస్థులు
దిలావర్పూర్లో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామస్థులు నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్భంగా వారు ఓ కీలక లేఖ విడుదల చేశారు. నేటి నుంచి చేపడుతున్న కులగణన కార్యక్రమాన్ని నిషేధిస్తున్నట్లు వారు ప్రకటించారు. బుధవారం స్థానిక తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో వినతిపత్రాన్ని సమర్పించారు. ఫ్యాక్టరీని తొలగిస్తేనే కులగణనలో పాల్గొంటామని తెలిపారు.
News November 6, 2024
నిర్మల్: విద్యార్థి మృతి పట్ల బీసీ శాఖ మంత్రి సంతాపం
దిలావర్పూర్ మండలం న్యూ లోలం గ్రామానికి చెందిన విద్యార్థి ఆయాన్ హుస్సేన్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా విషయం తెలుసుకున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన సంతాపాన్ని తెలిపారు. విద్యార్థి కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు.