News April 4, 2025
మందమర్రి: రక్షణతో కూడిన ఉత్పత్తికి కృషి చేయాలి: GM

మందమర్రి GM కార్యాలయంలో బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ GM రఘుకుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. గనులకు సంబంధించి తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎల్లప్పుడు రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించడానికి ప్రతి ఒక్కరు సమష్టి కృషి చేయాలన్నారు. సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 11, 2025
రూ.100కే T20 వరల్డ్ కప్ టికెట్స్

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి సంబంధించిన టికెట్లను ఇవాళ సాయంత్రం 6.45 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ICC ప్రకటించింది. ఇండియాలో ఫేజ్ వన్ టికెట్స్ రేట్స్ రూ.100 నుంచి, శ్రీలంకలో రూ.295 నుంచి ప్రారంభంకానున్నాయి. FEB 7నుంచి MAR 8 వరకు టోర్నీ కొనసాగనుంది. టికెట్స్ బుక్ చేసుకునేందుకు <
News December 11, 2025
ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి: ఎంపీ పుట్టా మహేష్ కుమార్

సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులందరూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) లో ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి 2010 ఆగస్టు నాటికి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. శీతాకాల సమావేశాల సందర్భంగా గురువారం లోక్ సభలో 377 నిబంధన కింద టీచర్ల సమస్యను ఏలూరు ఎంపీ లేవనెత్తారు. ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు పార్లమెంట్లో ప్రస్తావించారు.
News December 11, 2025
BREAKING: భువనగిరి: మరో ఊరిలో ఫలితాలు టై.. గెలుపెవరిదంటే?

యాదాద్రి-భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండలం పారుపల్లి గ్రామంలో BRS, కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లు సమానంగా పోలయ్యాయి. BRS బలపరిచిన అభ్యర్థి పంగ కవిత నవీన్‌కు 80 ఓట్లు రాగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి డి.పావని రమేశ్‌కు సైతం 80 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు లక్కీ డ్రా తీయగా BRS అభ్యర్థి పంగ కవిత నవీన్ గెలుపొందారు. BRS నేతలు హర్షం వ్యక్తం చేశారు.


