News April 4, 2025
మందమర్రి: రక్షణతో కూడిన ఉత్పత్తికి కృషి చేయాలి: GM

మందమర్రి GM కార్యాలయంలో బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ GM రఘుకుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. గనులకు సంబంధించి తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎల్లప్పుడు రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించడానికి ప్రతి ఒక్కరు సమష్టి కృషి చేయాలన్నారు. సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 17, 2025
ఉమ్మడి MBNR వ్యాప్తంగా నేటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్

సమ్మె కారణంగా తెలంగాణ పత్తి మిల్స్ అసోసియేషన్ నేటి నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి. గతంలో ఎకరానికి 12 క్వింటాళ్ల నిబంధనను తొలగించి, 7 క్వింటాళ్ల కొనుగోలు నిబంధన విధించడంతో పాటు మిల్లులకు గ్రేడ్స్ కేటాయించడంపై వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగానే ఈ సమ్మె చేస్తున్నట్లు మిల్లుల యజమానులు స్పష్టం చేశారు. SHARE IT.
News November 17, 2025
లోక్ అదాలత్ ద్వారా 5838 కేసులు పరిస్కారం: CP

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక లోక్ అదాలత్కు విశేష స్పందన లభించిందని, వీటి ద్వారా 5838 కేసులు పరిష్కారమయ్యాయని సీపీ సునీల్ దత్ తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా రాజీకి అవకాశం ఉండి పరిష్కరించిన 5838 కేసుల్లో ఎఫ్ఐఆర్ కేసులు-605, ఈ పెటీ కేసులు -2583, డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులు – 2650, సైబర్ కేసులు -195 పరిష్కరించడం ద్వారా రూ.92,45,636 బాధితులకు అందజేసినట్లు పేర్కొన్నారు.
News November 17, 2025
CII సదస్సు విజయవంతం: రాజన్

విశాఖపట్నం వేదికగా జరిగిన CII సదస్సు విజయవంతమైనట్లు చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు రాజన్ తెలిపారు. చిత్తూరులోని పార్టీ ఆఫీసులో ఆదివారం మాట్లాడారు. ఏపీలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఏపీ పారిశ్రామిక హబ్గా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో MP ప్రసాదరావు, ఎమ్మెల్యేలు నాని, మురళీమోహన్ ఎమ్మెల్సీ శ్రీకాంత్ పాల్గొన్నారు.


