News April 4, 2025
మందమర్రి: రక్షణతో కూడిన ఉత్పత్తికి కృషి చేయాలి: GM

మందమర్రి GM కార్యాలయంలో బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ GM రఘుకుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. గనులకు సంబంధించి తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎల్లప్పుడు రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించడానికి ప్రతి ఒక్కరు సమష్టి కృషి చేయాలన్నారు. సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News July 5, 2025
NRPT: అథ్లెటిక్స్ ఆడెందుకు బయలుదేరిన క్రీడాకారులు

తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఆడిందుకు నారాయణపేట జిల్లా క్రీడాకారులు శనివారం బయలుదేరారు. హనుమకొండలో రేపటి నుంచి ప్రారంభమయ్యే “Trithalon అథ్లెటిక్స్” అండర్-10, 12, 14 విభాగంలో 60 మీ. రన్నింగ్, లాంగ్ జంప్, జావిలిన్ త్రో తదితర క్రీడల్లో 20 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. మండల విద్యాధికారి కృష్ణారెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రెటరీ రమణ బెస్ట్ విషెస్ తెలిపారు.
News July 5, 2025
నాగర్‌కర్నూల్‌లో రేబిస్ వ్యాధి టీకాలు

ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా జిల్లా పశువైద్యశాఖ ఆధ్వర్యంలో రేబిస్ వ్యాధి నివారణ టీకా కార్యక్రమం ఆదివారం నిర్వహించనున్నారు. ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నాగర్‌కర్నూల్ పశువైద్యశాలలో ఈ టీకాలు వేయనున్నట్లు అని జిల్లా పశువైద్యశాఖ అధికారి జ్ఞానశేఖర్ తెలిపారు. శునకాల ప్రేమికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ పెంపుడు కుక్కలకు టీకాలు వేయించుకోవాలని ఆయన సూచించారు.
News July 5, 2025
దారుణం: కత్తితో పొడిచి.. తాళి కట్టి.. సెల్ఫీ దిగి

కర్ణాటకలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న యువతికి తాళి కట్టాడు. మైసూర్‌కు చెందిన పూర్ణిమ (36) టీచర్. అభిషేక్ ప్రేమ పేరుతో ఆమె వెంటపడేవాడు. ఇవాళ ఆమెను కత్తితో పొడిచాడు. యువతి స్పృహ తప్పి కిందపడిపోగానే మెడలో తాళి కట్టాడు. ఆపై సెల్ఫీ తీసుకుని మురిసిపోయాడు. తర్వాత అతడే ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమించడంతో పారిపోయాడు. పూర్ణిమ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది.