News March 15, 2025

మందమర్రి: GREAT.. గ్రూప్- 2,3,4 సాధించిన తిరుపతి

image

మందమర్రి ప్రాణహిత కాలానికి చెందిన <<15738168>>బొడ్డు తిరుపతి గ్రూపు- 4, 2, 3లలో సత్తాచాటి<<>> పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. 2016లో సింగరేణి నిర్వహించిన JMET ప్రవేశ పరీక్ష రాసి ఉద్యోగం సాధించాడు. తర్వాత గ్రూపు-4 పరీక్ష రాసి ఎన్నికై క్యాతనపల్లి మునిసిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. గ్రూప్-2లో రాష్ట్రస్థాయి 77 ర్యాంక్, తాజాగా విడుదలైన గ్రూప్-3ఫలితాల్లో రాష్ట్రస్థాయి 60వ ర్యాంకు సాధించాడు.

Similar News

News December 1, 2025

నార్నూర్: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

image

నార్నూర్ మండలంలోని ఉమ్రి గ్రామ వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని జాదవ్ నరేష్ (18) ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై గణపతి తెలిపారు. జైనూర్ మండలం అందుగూడకు చెందిన సునీత, అన్నాజీ దంపతుల కుమారుడు నరేష్ నాలుగేళ్లుగా పాలేరుగా పని చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో వెళ్లి చూడగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

News December 1, 2025

ఢిల్లీకి మంత్రి లోకేశ్.. రేపు కేంద్ర మంత్రులతో భేటీ

image

AP: మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీ వెళ్లారు. వారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు స్వాగతం పలికారు. రేపు పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్‌తో లోకేశ్, అనిత భేటీ కానున్నారు. మొంథా తుఫాను ప్రభావం వల్ల జరిగిన నష్టం అంచనా రిపోర్టును వారికి అందిస్తారు.

News December 1, 2025

అమరావతిని ఉద్యోగాల కల్పనకు కేంద్రంగా మారుస్తా: CM

image

అమరావతిని ఉద్యోగాల కల్పనకు కేంద్రంగా మారుస్తున్నామని, మొదటి దశ పనులు 2028 నాటికి పూర్తవుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం ఉంగుటూరు(M) నల్లమాడు సభలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం మరో 15-20 ఏళ్లు అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు. గత పాలకుల ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి ఊసే లేదని విమర్శించారు.