News March 15, 2025
మందమర్రి: GREAT.. గ్రూప్- 2,3,4 సాధించిన తిరుపతి

మందమర్రి ప్రాణహిత కాలానికి చెందిన <<15738168>>బొడ్డు తిరుపతి గ్రూపు- 4, 2, 3లలో సత్తాచాటి<<>> పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. 2016లో సింగరేణి నిర్వహించిన JMET ప్రవేశ పరీక్ష రాసి ఉద్యోగం సాధించాడు. తర్వాత గ్రూపు-4 పరీక్ష రాసి ఎన్నికై క్యాతనపల్లి మునిసిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. గ్రూప్-2లో రాష్ట్రస్థాయి 77 ర్యాంక్, తాజాగా విడుదలైన గ్రూప్-3ఫలితాల్లో రాష్ట్రస్థాయి 60వ ర్యాంకు సాధించాడు.
Similar News
News April 22, 2025
గిల్ పెళ్లిపై ప్రశ్న.. ఆయన ఆన్సరిదే

నిన్న KKR-GT మ్యాచ్ టాస్ సందర్భంగా శుభ్‌మన్ గిల్ పెళ్లి ప్లాన్స్ గురించి అడిగి కామెంటేటర్ డానీ మోరిసన్ నవ్వులు పూయించారు. ‘నువ్వు అందంగా ఉన్నావ్. త్వరలో పెళ్లి చేసుకుంటున్నావా?’ అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని ప్రిన్స్ సమాధానమిచ్చారు. కాగా సచిన్ కూతురు సారాతో గిల్ డేటింగ్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై వీరిద్దరూ స్పందించలేదు.
News April 22, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News April 22, 2025
ధర్పల్లి: వడదెబ్బతో రైతు మృతి

ధర్పల్లి మండలం వాడి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం వడదెబ్బతో కరక రాములు(65) అనే రైతు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇటీవల తన పొలంలో యంత్ర సాయంతో పంట కోయించారు. యంత్రం వెళ్లలేని ప్రాంతంలో మిగిలిపోయిన పంటను ఉదయం నుంచి కోస్తూ వడదెబ్బకు గురై మృతి చెందినట్లు తెలిపారు.