News January 26, 2025

మందస: చెట్టుకు ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

మందస మండలం లోహరి బంద గ్రామంలోని జీడీ తోటల్లో తాళ్ల జానకిరావు(52) చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు మందస ఎస్సై కె.కృష్ణప్రసాద్ ఆదివారం తెలిపారు. భార్య కమల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మద్యానికి బానిసైన జానకిరావు రోజూ తాగి వస్తుండడంతో కుటుంబ సభ్యులు అడిగారు. వారితో గొడవపడి జీడీ తోటలకు వెళ్లి ఉరివేసుకున్నట్లు ఎస్సై తెలిజేశారు.

Similar News

News February 27, 2026

ఘనంగా అరసవల్లి ఆదిత్యుని కళ్యాణం

image

అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శుక్రవారం స్వామి వారి కళ్యాణం జరిగింది. పాల్గుణ శుద్ధ ఏకాదశి సందర్భంగా కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఉదయం 8 గంటలకు అనివేటి మండపంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కళ్యాణం జరిగిందని ఆలయ డీసీ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

News February 27, 2026

శ్రీకాకుళంలో అదుపులోకి వస్తున్న డయేరియా

image

శ్రీకాకుళం నగరంలోని ఐదు సచివాలయాల పరిధిలో ఈనెల 23న మొదలైన డయేరియా అదుపులోకి వస్తోంది. గురువారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 102కు చేరగా, ప్రస్తుతం 67 మంది బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయి. పరిస్థితిని పర్యవేక్షిస్తూ అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంది. వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

News February 27, 2026

శ్రీకాకుళం: డయేరియాపై కేంద్ర మంత్రి సీరియస్

image

శ్రీకాకుళంలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా యంత్రాంగం, మున్సిపల్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తాగునీరు, మురికి కాలువల నిర్వహణ, పరిశుభ్రత విషయంలో అధికారులు జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.