News July 21, 2024

మందస: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

శ్రీకాకుళం జిల్లా మందస-బారువ రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ ఎస్.కె షరీఫ్ ఆదివారం తెలిపారు. అతని వయసు సుమారుగా 20-25 సంవత్సరాలు ఉంటుందన్నారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తించినట్లయితే 94406 27567 నంబర్‌ను సంప్రదించాలని ఎస్ఐ సూచించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 2, 2025

తమిళనాడు ప్రమాదం.. 3కి చేరిన శ్రీకాకుళం మృతుల సంఖ్య.!

image

రామేశ్వరం సమీపంలో కారు, టెంపో ట్రావెల్ బస్సును ఢీకొనగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచల, వీర రామచంద్రపురం (కొండూరు) గ్రామాలకి చెందిన ఇద్దరు యువకులు ఇల్లాకుల నవీన్ (25), పైడి సాయి(26) ఘటనా స్థలంలో మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన గుంటరాజు అనే యువకుడు మధురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.

News December 2, 2025

HIVకి భయపడవద్దు: శ్రీకాకుళం కలెక్టర్

image

హెచ్ఐవికి భయపడవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టర్ బంగ్లాలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 60మంది పిల్లలకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ప్రజలు హెచ్ఐవి పట్ల భయపడవద్దని, హెచ్ఐవి బాధితులను అక్కున చేర్చుకోవాలని, వారిపట్ల వివక్ష చూపరాదని సూచించారు. రిస్క్ గ్రూపులకు చెందినవారు నిరంతరం హెచ్ఐవి పరీక్షలు చేయించుకోవాలన్నారు.