News July 31, 2024
మందస: రోడ్డు ప్రమాద మృతుల వివరాలు లభ్యం
శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతీ, యువకుడు మృతిచెందిన విషయం విదితమే. మృతులు మందస మండలం కడుముసాయి గ్రామానికి చెందిన సవర హర్యాని(25), సవర జీవన్ (21)గా పోలీసులు గుర్తించారు. ఇందులో వదిన, మరిది దుర్మరణం పాలయ్యారు. తణుకు నుంచి బైక్ పై గ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో ఘటన జరిగింది. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు.
Similar News
News October 6, 2024
దసరా ఉత్సవాల కోసం ప్రత్యేక రైళ్లు
దసరా ఉత్సవాల కోసం విజయవాడ(BZA) నుంచి శ్రీకాకుళం రోడ్(CHE) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 6,7,8 తేదీల్లో BZA-CHE(నం.07215) మధ్య, 7,8,9 తేదీల్లో CHE- BZA(నం.07216) మధ్య ఈ రైళ్లు నడుపుతామన్నారు. విజయవాడలో ఈ రైళ్లు పై తేదీల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటాయన్నారు.
News October 6, 2024
అంపైర్‌గా సిక్కోలు వాసి
విజయవాడలో ఆలిండియా జూనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ పోటీలు ఈనెల 11వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పోటీలకు అంపైర్‌గా ఉద్దానం ప్రాంతానికి చెందిన తుంగాన శరత్‌కు అవకాశం వచ్చింది. ఈ మేరకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ నుంచి శరత్‌కు ఉత్తర్వులు అందాయి. ఆయనను పలువురు అభినందించారు.
News October 6, 2024
SKLM: నేటి నుంచి IIITకి సెలవులు
ఎచ్చెర్లలోని IIIT క్యాంపస్‌కు నేటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు దసరా సెలవులు ఇచ్చినట్లు డైరెక్టర్ బాలాజీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీ సోమవారం తరగతులు తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.