News August 10, 2024
మక్కువ: ఫీడర్ అంబులెన్స్‌లోనే గర్భిణీ ప్రసవం
ప్రభుత్వాలు మారుతున్నా, గిరిజనుల తల రాతలు మాత్రం మారడం లేదు. మక్కవ మం. వీరమాసికి చెందిన చౌడిపల్లి బుల్లికు శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్‌కు ఫోన్ చేశరు. రావడం ఆలస్యం కావడంతో కుటుంబ సభ్యులు డోలితో నంద వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి బైక్‌పై తీసుకెళ్లగా, కాసేపటికి ఫీడర్ అంబులెన్స్ వచ్చింది. కొద్ది దూరం వెళ్లగా, అంబులెన్స్‌లోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు.
Similar News
News November 26, 2024
గత ఐదేళ్లు జీసీసీ పూర్తిగా నిర్వీర్యం:కిడారి
గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం జీసిసిని పూర్తిగా నిర్వీర్యం చేసిందని దీని బలోపేతానికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఆ సంస్థ రాష్ట్ర ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. విజయనగరంలో సబ్బుల తయారీ యూనిట్‌ను ఆయన సోమవారం పరిశీలించారు. ప్రైవేటు సరుకులు మాదిరిగా డిసిసి సరుకులు జనాలను ఆకర్షించే విధంగా నాణ్యతతో తయారు చేస్తామని చెప్పారు.
News November 25, 2024
విజయనగరం TO పాడేరు వయా అరకు..!
విజయనగరం నుంచి అరకు మీదుగా పాడేరుకు త్వరలో బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సియ్యారి దొన్నుదొర చెప్పారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంతం నుంచి పర్యాటకులు, ఉద్యోగులు అరకు, పాడేరు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని వారికి ఈ బస్సు వల్ల ప్రయాణం సులభతరమవుతుందన్నారు.
News November 25, 2024
IPL వేలంలో యశ్వంత్‌కు నిరాశ
రెండో రోజు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మెగా వేలంలో విజయనగరం జిల్లా గరివిడికి చెందిన బైలపూడి యశ్వంత్‌కు నిరాశ ఎదురైంది. త్వరలో జరగనున్న ఐపీఎల్ సీజన్‌కు రూ.30లక్షల బేస్ ప్రైస్‌తో యశ్వంత్ తన అదృష్టాన్ని పరీక్షించుకోగా.. తీసుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజ్‌లు ఆసక్తి చూపలేదు. దీంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.