News May 10, 2024
మక్తల్‌కు చేరుకున్న సీఎం రేవంత్

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మక్తల్ నియోజకవర్గంలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పర్ణిక రెడ్డి, వాకిటి శ్రీహరి, ఇతర కాంగ్రెస్ ముఖ్య నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. జన జాతర సభకు ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Similar News
News October 27, 2025
MBNR: కురుమూర్తి జాతర.. ప్రత్యేక బస్సులు

కురుమూర్తి జాతర సందర్భంగా మహబూబ్ నగర్ బస్ స్టేషన్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుజాత Way2Newsతో తెలిపారు. నేటి నుంచి ఈనెల 30 వరకు కురుమూర్తి జాతర నేపథ్యంలో ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రయాణికులు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.SHARE IT.
News October 26, 2025
MBNR: సాదాబైనామాల పరిష్కారానికి మోక్షం

సాదాబైనామాల దరఖాస్తుల పరిష్కారానికి మోక్షం కలగనుంది. జీఓ 112 అమలుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియను రెవెన్యూ అధికారులు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 2020లో ఆన్లైన్లో వచ్చిన 4,217, ఇటీవల రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన 3,456 దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించారు. దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.
News October 25, 2025
బాలానగర్: పుట్టినరోజే.. చివరి రోజుగా మారింది..!

బాలానగర్ మండలంలోని పంచాంగుల గడ్డ తండాలో శనివారం తీవ్ర విషాదం నెలకొంది. తాండవాసుల వివరాల ప్రకారం.. కేతావత్ విష్ణు (25) సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. కుటుంబ సభ్యులతో భూమి, డబ్బుల విషయంలో విషయంలో గొడవపడ్డాడు. క్షణికావేశంలో 3 రోజుల క్రితం క్రిమిసంహారక మందు తాగాడు. చికిత్స పొందుతూ.. ఈరోజు ఉదయం మృతి చెందాడు. పుట్టినరోజు నాడే.. మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


