News January 23, 2025
మక్తల్: అనుమానాలొద్దు.. అందరికీ పథకాలు: కలెక్టర్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు కొత్త సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని, ఎవరు ఆందోళన చెందవద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మక్తల్ పట్టణంలోని కేశవనగర్ వార్డు కమిటీ హాల్ లో 3, 7, 11, 15 వార్డులకు సంబంధించిన వార్డు సభను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. కొత్తగా అమలయ్యే నాలుగు పథకాలపై ప్రజలు అనుమానాలు పెట్టుకోవద్దని, అర్హులైన వారికి పథకాలు అందుతాయన్నారు.
Similar News
News November 16, 2025
WTC: నాలుగో స్థానానికి పడిపోయిన భారత్

SAతో తొలి టెస్టులో ఓటమితో భారత్ WTC పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. టీమ్ ఇండియా ఈ సీజన్లో 8 మ్యాచ్లు ఆడి 4 విజయాలు, 3 ఓటములు, ఓ మ్యాచ్ డ్రాగా ముగించింది. ప్రస్తుతం IND విజయాల శాతం 54.17గా ఉంది. ఇక ఆడిన 3 మ్యాచుల్లోనూ గెలిచిన AUS అగ్రస్థానంలో ఉండగా, సఫారీలు(విజయాల శాతం 66.67) రెండో స్థానంలో ఉన్నారు. 3, 5, 6, 7వ స్థానాల్లో SL(66.7), PAK(50.00), ENG(43.33), BAN(16.7) ఉన్నాయి.
News November 16, 2025
పీఆర్సీని వెంటనే ప్రకటించాలి: యూటీఎఫ్

వేతన సవరణ కమిషన్(పీఆర్సీ) రిపోర్టును వెంటనే ప్రకటించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ రాములు డిమాండ్ చేశారు. సూర్యాపేట యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన ఆఫీస్ బేరర్ల సమావేశంలో మాట్లాడారు. 2023 జులై 1 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ ఇప్పటివరకు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సోమయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
News November 16, 2025
పార్వతీపురం: ‘సివిల్స్ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్’

UPSC-2026 ప్రిలిమినరీ పరీక్ష కోసం అర్హులైన పేద సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పార్వతీపురం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద ఉచిత కోచింగ్ పొందాలనుకునే అభ్యర్థులు నవంబర్ 13 నుంచి 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.


