News April 12, 2025
మక్తల్: ఇరిగేషన్ అధికారులతో సమీక్ష చేసిన ఎమ్మెల్యే

మక్తల్ ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్, ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రిజర్వాయర్ గేట్ల నుంచి నీరు వృథా కాకుండా మరమ్మతులు చేపట్టాలని చెప్పారు. లక్ష్యం మేరకు వ్యవసాయ పొలాలకు సాగు నీటిని అందించాలని చెప్పారు. అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 24, 2025
రియల్ కంపెనీలపై ఈడీ రైడ్స్ కలకలం

హైదరాబాద్‌లోని 8 రియల్ ఎస్టేట్ కంపెనీలపై ED దాడులు చేసింది. జయత్రి, జనప్రియ, రాజా డెవలపర్స్, శ్రీ గాయత్రి హోమ్స్, శివసాయి కన్స్టక్షన్స్ తదితర కంపెనీల్లో అగ్రిమెంట్స్, హార్డ్ డ్రైవ్స్ సహా పలు డాక్యుమెంట్స్, డిజిటల్ అసెట్స్ సీజ్ చేశారు. ప్రి లాంఛ్ పేరుతో కస్టమర్స్ నుంచి జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రూ.60 కోట్లు తీసుకుని షెల్ కంపెనీలకు మళ్లించిందని వచ్చిన కంప్లైంట్స్‌పై ఈ రైడ్స్ జరిగాయి.
News November 24, 2025
కొమురం భీమ్‌కు SP నివాళి

జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నితికా పంత్ కెరమెరి (M) జోడేఘాట్లోని ఆదివాసీ నాయకుడు కొమరం భీమ్ విగ్రహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఎస్పీ, ఏఎస్పీకి ఆదివాసీ పెద్దలు పూల మొక్కలు అందించి, తలపాగా చుట్టి ఘనస్వాగతం పలికారు. గిరిజన ఆచార సంప్రదాయాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. మారుమూల గిరిజన ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సహాయం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
News November 24, 2025
సంగారెడ్డి: రేపు వడ్డీ లేని రుణాల పంపిణీ

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించాలని కలెక్టర్ ప్రావీణ్య సోమవారం తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి పిలవాలని చెప్పారు. జిల్లాలోని 15,926 మహిళా సంఘాలకు 16.78 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.


