News April 4, 2025
మక్తల్: బైక్‌లో ఉంచిన.. రూ.1,50,000 చోరీ

బ్యాంకు దగ్గర బైక్‌లో ఉంచిన నగదును గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేసిన ఘటన మక్తల్ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. SI భాగ్యలక్ష్మి రెడ్డి కథనం మేరకు.. మాగనూరు మండలం నేరేడుగం గ్రామానికి చెందిన లింగాయత్ నాగప్ప మక్తల్ పట్టణంలోని SBIలో రూ. 1,50,000 డ్రా చేశాడు. బ్యాంక్ ఎదుట పార్క్ చేసిన తన బైక్‌లో ఉంచి అక్కడే ఉన్న జిరాక్స్ సెంటర్‌కు వెళ్లి వచ్చేసరికి నగదు మాయమైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Similar News
News April 5, 2025
దిగ్వేశ్కు మళ్లీ ఫైన్.. ఈసారి ఏకంగా!

LSG బౌలర్ దిగ్వేశ్ రాఠీకి BCCI మళ్లీ <<15965200>>ఫైన్<<>> విధించింది. నిన్న MIతో మ్యాచ్‌లో వికెట్ తీసిన అనంతర మరోసారి ‘నోట్‌బుక్’ సెలబ్రేషన్ చేసుకోవడంతో <<15965793>>మ్యాచ్ ఫీజు<<>>లో 50% కోత, 2 డీమెరిట్ పాయింట్లు విధించింది. దిగ్వేశ్కు ఇలా ఫైన్ పడుతుండటంతో సీజన్ చివరకు వేలంలో వచ్చిన డబ్బు ఫైన్లు కట్టడానికే సరిపోతుందని మీమ్స్ పేలుతున్నాయి. మరోవైపు కెప్టెన్ పంత్‌కూ స్లోఓవర్ రేట్ కారణంగా రూ.12లక్షల ఫైన్ పడింది.
News April 5, 2025
400 ఎకరాల్లోకి ప్రవేశిస్తే చర్యలే..!: DCP

రాష్ట్రాన్ని కదిలించిన కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూవివాదంపై HYD మాదాపూర్ డీసీపీ వినీత్ కీలక నోటీసు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు కఠినంగా అమలవుతాయని పేర్కొన్నారు. నేటి నుంచి ఏప్రిల్ 16 వరకు 400 ఎకరాల భూమిలో సంబంధిత పనులు కోసం ప్రవేశం నిషేధించినట్లు పేర్కొన్నారు. అతిక్రమిస్తే చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News April 5, 2025
HYD: వెదర్ అప్డేట్స్ ఇచ్చేది ఈయనే..!

HYD సహా తెలంగాణలోని అన్ని జిల్లాలకు సంబంధించి క్షణ క్షణం సోషల్ మీడియా వేదికగా కూకట్పల్లి JNTUH విద్యార్థి బాలాజీ వెదర్ అప్డేట్స్ అందిస్తుంటారు. బాలాజీ అప్డేట్స్ కచ్చితత్వంతో కూడుకున్నవిగా ప్రజలు నమ్ముతున్నారు. శుక్రవారం JNTUH యూనివర్సిటీ VC కిషెన్ కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూనే ఆయనను అభినందించారు. తనను అభినందించడం ఎంతో ఆనందంగా ఉందని, అప్డేట్స్ అందిస్తూనే ఉంటానని తెలిపారు.