News March 23, 2025
మక్తల్: బ్యాక్లాగ్ సీట్ల ప్రవేశాలకు ఆహ్వానం

మహాత్మ జ్యోతిబాఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బీసీ బాలబాలికల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో 6, 7, 8, 9వ తరగతుల్లో ఆంగ్ల మీడియంలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ సీట్లకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఈ బీసీలకు తెలంగాణ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని మక్తల్ ఎంజేపీ ప్రధానాచార్యులు కే హెన్రీ ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News February 27, 2026
ఆరుట్ల మోడల్.. 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్!

TG: రంగారెడ్డి(D) ఆరుట్ల స్కూల్ తరహాలో 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్(TPS) ప్రారంభించాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. క్లాస్ రూములు, గ్రౌండ్, ట్రాన్స్‌పోర్ట్, టీచింగ్ స్టాఫ్ వంటి సకల వసతులు ఉండేలా చూడాలన్నారు. ఇక HYDలో 12 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏడాదిలోగా పూర్తి చేయాలని సూచించారు. నాణ్యమైన విద్య కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడబోమని స్పష్టం చేశారు.
News February 27, 2026
గంగా జలం ఇంటికి తెచ్చుకుంటున్నారా?

గంగా జలం ఇంట్లో ఉంటే చాలా మంచిది. అయితే పుణ్య క్షేత్రాల నుంచి ఆ జలాన్ని తెచ్చేటప్పుడు చాలామంది ప్లాస్టిక్ బాటిళ్లు వాడుతుంటారు. దాని బదులు ఇత్తడి పాత్రలు వాడితే ఆ జలంలోని ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘గంగా జలం వాస్తు దోషాలను, ప్రతికూల శక్తులను పోగొడుతుంది. గ్రహణాల తర్వాత, శుభకార్యాలప్పుడు ఇంటిని శుద్ధి చేయడానికి దీనిని ప్రోక్షించడం వల్ల సానుకూలత పెరుగుతుంది’ అంటున్నారు.
News February 27, 2026
“చద్దిలేని పయనం, ఒంటి ఎద్దు సేద్యం”

పూర్వం కాలినడకన, ఎడ్లబండ్ల మీద ప్రయాణాలు చేసేవారు. అప్పట్లో హోటల్స్ ఉండేవి కావు. అప్పుడు తిండి లేకుండా చాలా దూరం ప్రయాణించాల్సి వస్తే ఆకలితో అలమటించి నీరసించిపోయేవారు. అలాగే వ్యవసాయానికి జత ఎడ్లు ఉండాలి. ఒక ఎద్దు కట్టి పొలం దున్నడం అసాధ్యం. ఒకవేళ చేసినా అది కష్టంగా మారుతుంది. అందుకే ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు సరైన ప్రణాళిక, వనరులు, అవసరమైన సాయం లేకపోతే అది విజయవంతం కాదని ఈ సామెత చెబుతుంది.


