News March 23, 2025
మక్తల్: బ్యాక్లాగ్ సీట్ల ప్రవేశాలకు ఆహ్వానం

మహాత్మ జ్యోతిబాఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బీసీ బాలబాలికల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో 6, 7, 8, 9వ తరగతుల్లో ఆంగ్ల మీడియంలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ సీట్లకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఈ బీసీలకు తెలంగాణ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని మక్తల్ ఎంజేపీ ప్రధానాచార్యులు కే హెన్రీ ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News April 24, 2025
ఉగ్రదాడిలో హస్తం లేకపోతే పాక్‌కు ఎందుకు ఉలికిపాటు?: మాజీ క్రికెటర్

పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ పాత్రపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ప్రశ్నించారు. ‘ఉగ్రదాడిలో నిజంగా పాకిస్థాన్ పాత్ర లేకపోయి ఉంటే ప్రధాని షెహబాజ్ ఇంకా ఎందుకు ఖండించలేదు? బలగాలెందుకు హై అలర్ట్‌లో ఉన్నాయి? ఎందుకంటే ఉగ్రవాదులకు నిలయంగా వారిని పెంచి పోషిస్తున్నామని పాక్‌కూ తెలుసు. సిగ్గు పడాలి’ అని ట్వీట్ చేశారు.
News April 24, 2025
MBNR: ప్రశాంత్ రెడ్డి హత్య కుట్ర కేసులో ఇద్దరి అరెస్ట్

దేవరకద్ర BJP నేత కొండా ప్రశాంత్ రెడ్డి హత్య కుట్ర కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు MBNR SP జానకి వెల్లడించారు. అనుమానితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. డబ్బు కోసమే ప్రశాంత్ రెడ్డి హత్యకు ప్లాన్ చేశారని, ఇందులో ఎలాంటి రాజకీయకోణం లేదన్నారు. ప్రశాంత్ రెడ్డి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా భయపెడుతున్నారని హత్యకు రూప్‌సింగ్ ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు.
News April 24, 2025
ఒంగోలు: రేషన్ మాఫియా డాన్ పనేనా..?

ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో ఓ రేషన్ మాఫియా డాన్ పేరు బలంగా వినిపిస్తోంది. ఒంగోలులో హత్య తర్వాత అతను ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. వాహనాలు మారుస్తూ గుంటూరు(D) వెదుళ్లపల్లికి వెళ్లి అక్కడ ఓ రైస్ మిల్లర్ నుంచి డబ్బులు తీసుకెళ్లినట్లు సమాచారం. ఆ మిల్లర్ సమాచారంతో డాన్‌కు సహకరించారన్న అనుమానంతో నిన్న సాయంత్రం ఐదుగురిని పొన్నూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.