News February 18, 2025
మక్తల్: భూ సర్వే చేపట్టడంపై రైతుల ఆందోళన

నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా మక్తల్ మండల పరిధిలోని కాట్రేవ్ పల్లి, ఎర్నగన్ పల్లి గ్రామాల శివారులో సోమవారం అధికారులు భూ సర్వే చేపట్టారు. దీంతో భూములు కోల్పోతున్న రైతులు అక్కడికి చేరుకుని భూ సర్వే ను అడ్డుకున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా భూ సర్వే ఎలా చేస్తారని ఆందోళనకు దిగారు. ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని బెదిరించాడు. రైతులతో సమావేశం నిర్వహించి భూ సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు.
Similar News
News February 25, 2026
కృష్ణా: మంత్రి లోకేశ్‌కు అభినందనలు తెలిపిన ఏపీ హైకోర్టు

కేజీబీవీల టీచర్ల జీతాలు పెంచుతామని, ఖాళీ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రకటనలను AP హైకోర్టు ప్రశంసించింది. సమస్యలపై స్పందించిన మంత్రి పరిష్కార చర్యలు తీసుకుంటున్నారని కోర్టు తెలిపింది. హాస్టల్లో విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటనపై స్పందించిన తీరును అభినందించింది. అయితే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
News February 25, 2026
GNT: మంత్రి లోకేశ్‌కు అభినందనలు తెలిపిన ఏపీ హైకోర్టు

కేజీబీవీల టీచర్ల జీతాలు పెంచుతామని, ఖాళీ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రకటనలను AP హైకోర్టు ప్రశంసించింది. సమస్యలపై స్పందించిన మంత్రి పరిష్కార చర్యలు తీసుకుంటున్నారని కోర్టు తెలిపింది. హాస్టల్లో విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటనపై స్పందించిన తీరును అభినందించింది. అయితే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
News February 25, 2026
గణపవరం: టెన్త్ అర్హతతో 200 ఉద్యోగాలకు జాబ్ మేళా

గణపవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 26న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.పి.నిర్మల కుమారి చెప్పారు. ఈ మేళాలో జీఎల్, పేటీయం, డెక్కన్ కెమికల్స్ తదితర కంపెనీల్లో 200లకు పైగా ఖాళీలు ఉన్నాయని, 2023,24,25,26 సంవత్సరాల్లో టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన 28 ఏళ్లు ఉన్నవారు అర్హులన్నారు. అభ్యర్థులు 26న (గురువారం) ఉదయం 10 గం.లకు డిగ్రీ కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో హాజరవ్వలన్నారు.