News June 19, 2024
మక్తల్: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మక్తల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. స్థానికుల వివరాలు.. మండలంలోని అనుగొండకు చెందిన సంజీవ్, కవిత(45) దంపతులు మక్తల్‌లో వరి విత్తనాలు కొనుగోలు చేసి బైక్‌పై గ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో స్థానిక సాయిబాబా మందిరం సమీపంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో కిందపడిన కవిత తలపై నుంచి లారీ వెళ్లడంతో స్పాట్లో చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News September 8, 2024
MBNR: పనిచేయని సీసీ కెమెరాలు..!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖ వారి గణాంకాల ప్రకారం ప్రధాన కూడళ్ళు, పట్టణాలు, మండల కేంద్రాల్లో మొత్తం 6,643 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో రూ.లక్షలు వెచ్చించి నేరాల పరిశోధనల్లో, కేసుల ఛేదనలో ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. కానీ నిర్వహణ లోపంతో మొత్తం 1,350 సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో పోలీసులకు కేసుల ఛేదన సవాలుగా మారుతోంది.
News September 8, 2024
గద్వాల: నీటి గుంతలో పడి పదేళ్ల బాలుడి మృతి
గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో పండగ పూట విషాదం నెలకొంది. నీటి గుంతలో పడి బాలుడు మృతిచెందాడు. స్థానికుల సమాచారం.. తనగల గ్రామ శివారులోని గుట్ట మొరం మట్టిని తరలించగా ఏర్పడిన గుంతలో నీరు నిల్వ నిలిచింది. గ్రామానికి చెందిన బోయ భాస్కర్ కుమారుడు పట్టాభి(10) శనివారం స్నేహితులతో కలిసి వెళ్లి ప్రమాదవశాత్తు ఆ గుంటలో పడి మరణించాడు. ఒక్కగానొక్క కొడుకు మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుయ్యారు.
News September 8, 2024
రాష్ట్రంలోనే అత్యల్పంగా అక్షరాస్యత గల జిల్లా గద్వాల !
వయోజనులను అక్షరాలు నేర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నవ భారత సాక్షరత కార్యక్రమం అమలు చేసిందని, వాటిపై ప్రత్యేక దృష్టి పెడతామని వయోజన విద్య ప్రోగ్రాం అధికారి నుమాన్ అన్నారు. ఉమ్మడి జిల్లాలో MBNR-55.04%, GDWL-49.87%, NGKL-58.99%, NRPT-49.98%, WNPT-55.67 శాతం అక్షరాస్యత ఉందని అంచనా. GDWL జిల్లా రాష్ట్రంలోనే అక్షరాస్యత అత్యల్పంగా ఉంది. నేడు ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.