News March 13, 2025

మగ, ఆడపిల్లలను సమానంగా చూడాలి: ఎస్పీ ఉదయ్

image

తల్లిదండ్రులు మన ఇంట్లోనుంచే మగ పిల్లలను, ఆడపిల్లలను సమానంగా చూడాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం మహిళా దినోత్సవం నిర్వహించారు. తల్లిదండ్రులు మగ పిల్లలకు ఇచ్చే స్వేచ్ఛను ఆడపిల్లలకు ఇస్తూ మంచి విద్యను అందించాలన్నారు. సమాజంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యమన్నారు. మహిళలు ఈ రోజుల్లో తాము ఎందులోనూ తక్కువ కాదన్న విషయాన్ని గుర్తించాలన్నారు.

Similar News

News March 24, 2025

MDK: ఆశా వ‌ర్క‌ర్ల‌ను విడుద‌ల చేయాలని హ‌రీశ్‌రావు డిమాండ్

image

రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల అరెస్టులను బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేయడమే వారు చేసిన నేరమా?, వందల సంఖ్యలో పోలీసులను మోహరించి, బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీసు స్టేషన్లకు తరలించడం దుర్మార్గం అని మండిప‌డ్డారు.

News March 24, 2025

మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు…!

image

మెదక్ జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. హవేలిఘనపూర్, రేగోడ్ 36.6, అల్లాదుర్గ్ 36.5, పాపన్నపేట్ 36.4, కౌడిపల్లి, టేక్మాల్ 36.0, పెద్దశంకరంపేట్ 35.9, మెదక్ 35.8, నర్సాపూర్, వెల్దుర్తి 35.3, కుల్చారం 34.8, శివ్వంపేట, మనోహరాబాద్ 34.7°C జిల్లాలోని గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత దృష్ట్యా వృద్దులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

News March 24, 2025

ఉమ్మడి మెదక్ జిల్లాలో పొలిటికల్ వార్

image

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్, BRS పాదయాత్రలతో రాజకీయాలు వేడెక్కాయి. గజ్వేల్ మాజీ MLA నర్సారెడ్డి రాజ్‌భవన్‌కు పాదయాత చేపట్టగా.. BRS మాజీ MLA ‘ఎండిన గోదావరి తల్లి కన్నీటి గోస’తో చేపట్టిన పాదయాత్ర ముగిసింది. గజ్వేల్ MLA క్యాంపు ఆఫీస్‌కు బీజేపీ నేతలు TOLET బోర్డు పెట్టడంతో కాంగ్రెస్, బీజేపీ కావాలనే కుట్రలో భాగంగా కేసీఆర్‌ను భద్నం చేయాలని చూస్తున్నాయని BRS శ్రేణులు మండిపడుతున్నారు. మరి మీ కామెంట్..

error: Content is protected !!