News January 8, 2025
మచిలీపట్నంలో దారుణ హత్య
మచిలీపట్నంలో ఓ వ్యక్తి మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. చిలకలపూడికి చెందిన రవి అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ రవిని హుటాహుటిన సర్వజన ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 10, 2025
ఆ సమాచారం తెలిస్తే ఈ నెంబరుకు ఫోన్ చేయండి: సీపీ
గంజాయి ఇతర మత్తు పదార్థాలు అమ్మే ప్రదేశాలు, వ్యక్తులు, వాహనాల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ రాజశేఖరబాబు సూచించారు. ఆ సమాచారం ఇచ్చేందుకు 1972 లేదా 112 నెంబరుకు కాల్ చేయాలని ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని సీపీ రాజశేఖరబాబు ఈ మేరకు యువతకు సూచించారు.
News January 10, 2025
పెనమలూరులో అత్తను చంపిన అల్లుడు
పెనమలూరు మండలంలోని పోరంకిలో గురువారం రాత్రి దారుణం జరిగింది. అత్తను అల్లుడు బండరాయితో తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. కుటుంబ కలహాల నేపథ్యంలో పోరంకికి చెందిన ఉమ్మడి రాణి(65)ని ఆమె అల్లుడు నారబోయిన నరేశ్ రాయితో కొట్టడంతో మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉయ్యూరు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News January 9, 2025
కృష్ణా: రేపటి నుంచి సెలవులు
కృష్ణా విశ్వవిద్యాలయం విద్యార్థులకు శుక్రవారం నుంచి సెలవులు రానున్నాయి. పీజీ విద్యార్థుల పరీక్షలు గురువారం ముగియడంతో విద్యార్థులు సెలవుల మూడ్లోకి వెళ్లనున్నారు. రెండో శనివారం, ఆదివారం సెలవు దినం కావడంతో ఆ రెండు రోజులు యూనివర్సిటీకి శెలవు ప్రకటించారు. సోమవారం నుంచి శనివారం వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చినట్లు వర్సిటీ యాజమాన్యం తెలిపింది. ఈ నెల 20 నుంచి కృష్ణా వర్సిటీ తరగతులు పునఃప్రారంభం కానున్నాయి.