News March 30, 2024
మచిలీపట్నం: అరుదైన రికార్డు ముంగిట బాలశౌరి

మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో 16 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరగగా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒకే నాయకుడు రెండు వేర్వేరు పార్టీల నుంచి గెలుపొందలేదు. 2019లో వైసీపీ నుంచి గెలిచిన బాలశౌరి ఈసారి జనసేనలో చేరి NDA కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచారు. వచ్చే ఎన్నికల్లో బాలశౌరి గెలిస్తే 2 వేర్వేరు పార్టీల నుంచి మచిలీపట్నం ఎంపీగా గెలిచిన తొలి నాయకుడిగా గుర్తింపు పొందుతారు. మరి మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Similar News
News December 21, 2025
ప్రకృతి వ్యవసాయంతోనే స్థిర ఆదాయం: కలెక్టర్

రైతులంతా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపినప్పుడే స్థిరమైన ఆదాయం లభిస్తుందని కలెక్టర్ బాలాజీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి పినగూడూరు లంకలోని అభ్యుదయ రైతు మేకపోతుల విజయరామ్ గురూజీ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. పాడి ఆవుల ద్వారా కేవలం పాలు అమ్మడమే కాకుండా, గోమయం, గోమూత్రంతో పూజా సామాగ్రి వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి అధిక లాభాలు గడించవచ్చని ఆయన అన్నారు.
News December 21, 2025
మచిలీపట్నం-అజ్మీర్ స్పెషల్ ట్రైన్ ప్రారంభం

మచిలీపట్నం-అజ్మీర్ ప్రత్యేక రైలును ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు ఆదివారం ప్రారంభించారు. మంత్రి కొల్లు రవీంద్ర తరఫున ఆయన తనయుడు పునీత్ ఇనగుదురుపేట జెండా సెంటర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన చాదర్‌ను ర్యాలీగా రైల్వే స్టేషన్‌కు తీసుకువచ్చి అజ్మీర్‌కు పంపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
News December 21, 2025
కృష్ణా: మళ్లీ బీసీ వర్గానికి టీడీపీ జిల్లా పీఠం

టీడీపీ కృష్ణా జిల్లా పీఠం మరోసారి BC వర్గాలకే దక్కింది. BC (గౌడ) వర్గానికి చెందిన వీరంకి వెంకట గురుమూర్తిని జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. గత రెండు పర్యాయాలు కూడా BC వర్గానికి చెందిన బచ్చుల అర్జునుడు, కొనకళ్ల నారాయణరావులే TDP జిల్లా అధ్యక్షులుగా పనిచేసి పార్టీ పటిష్టతకు కృషి చేశారు. గురుమూర్తి నాయకత్వంలో కూడా పార్టీ మరింత బలోపేతం కానుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.


