News March 30, 2024
మచిలీపట్నం: అరుదైన రికార్డు ముంగిట బాలశౌరి

మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో 16 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరగగా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒకే నాయకుడు రెండు వేర్వేరు పార్టీల నుంచి గెలుపొందలేదు. 2019లో వైసీపీ నుంచి గెలిచిన బాలశౌరి ఈసారి జనసేనలో చేరి NDA కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచారు. వచ్చే ఎన్నికల్లో బాలశౌరి గెలిస్తే 2 వేర్వేరు పార్టీల నుంచి మచిలీపట్నం ఎంపీగా గెలిచిన తొలి నాయకుడిగా గుర్తింపు పొందుతారు. మరి మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Similar News
News April 11, 2026
కృష్ణా: పన్నుల వసూళ్లలో బందరు కార్పొరేషన్ పూర్!

మచిలీపట్నం కార్పొరేషన్‌లో పన్నుల వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. రూ.39 కోట్ల లక్ష్యానికి గానూ కేవలం రూ.16 కోట్లే వసూలయ్యాయి. అక్రమ కట్టడాల కూల్చివేతపై చూపే ఉత్సాహం వసూళ్లలో కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పొరుగున ఉన్న గుడివాడ మెరుగైన ఫలితాలు సాధించగా, జిల్లా కేంద్రం మాత్రం వెనుకబడింది. ఏప్రిల్ నెలాఖరు వరకు ఉన్న 50% వడ్డీ రాయితీతోనైనా అధికారులు బకాయిలు రాబడతారో లేదో చూడాలి.
News April 10, 2026
పెడనలో మట్టి మాఫియా బరితెగింపు!

పెడన నియోజకవర్గంలోని గూడూరు, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో మట్టి మాఫియా బరితెగిస్తోంది. చిన్నగొల్లపాలెం, కృత్తివెన్ను ప్రాంతాల నుంచి అక్రమంగా తవ్విన మట్టి ఏకంగా జిల్లాలు దాటుతోంది. గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. కొంకేపూడి-ఈదుముడి కనెక్టింగ్ బ్రిడ్జిపై నిత్యం వందలాది లారీలు తిరుగుతుండడంతో ఆ వంతెన బలహీనపడి కూలిపోయే స్థితికి చేరుకుంది.
News April 10, 2026
రక్తదానం ప్రాణదానంతో సమానమనం: కలెక్టర్ బాలాజీ

మచిలీపట్నంలో ‘సర్వే డే’ పురస్కరించుకొని నిర్వహించిన రక్తదాన శిబిరంలో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ నవీన్ స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు.


