News April 15, 2025

మచిలీపట్నం: అవనిగడ్డలో మెగా జాబ్ మేళా

image

ఈ నెల 17న అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మంగళవారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 19 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులని, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.

Similar News

News October 19, 2025

కృష్ణా: కార్తీకమాసానికి ఆలయాలు ముస్తాబు

image

కార్తీకమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని ఆలయాలు ముస్తాబవుతున్నాయి. హిందువులు నియమనిష్టలతో ఆచరించే ఈ మాసంలో ప్రత్యేక పూజలు, దీపారాధనలకు ఆలయ నిర్వాహకులు సర్వసన్నద్ధమవుతున్నారు. కార్తీకంలో శివాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారుల సూచన.

News October 19, 2025

మచిలీపట్నంలో నేటి నాన్ వెజ్ ధరలు ఇవే.!

image

మచిలీపట్నంలో ఆదివారం చికెన్, మటన్ ధరల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య తేడాలు కనిపించాయి. పట్టణంలో చికెన్ విత్ స్కిన్ కిలో రూ. 200, స్కిన్‌లెస్ రూ. 220కి అమ్ముతున్నారు. గ్రామాల్లో స్కిన్ చికెన్ కేజీ రూ. 220, స్కిన్‌లెస్ రూ. 240కి విక్రయిస్తున్నారు. మటన్ ధర మాత్రం పట్టణంలో కిలో రూ. 1000గా ఉంటే, గ్రామాల్లో రూ. 800కి విక్రయాలు జరుగుతున్నాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News October 18, 2025

కృష్ణా జిల్లాలో వర్షం.. దీపావళి వ్యాపారులకు ఆటంకం

image

దీపావళి పండుగ సందర్భంగా కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో టపాసులు, గుండు సామాగ్రి దుకాణాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్న వర్షం వ్యాపారులకు ఆటంకంగా మారింది. పండుగ సీజన్‌లో అధిక ఆదాయం ఆశించిన వ్యాపారులకు ఒకవైపు వర్షం, మరోవైపు అధికారుల అనుమతులు, భద్రతా నిబంధనల పరిమితులు కూడా పెద్ద సవాలుగా మారాయి.