News April 15, 2025
మచిలీపట్నం: అవనిగడ్డలో మెగా జాబ్ మేళా

ఈ నెల 17న అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మంగళవారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 19 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులని, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.
Similar News
News April 25, 2025
తేలప్రోలు: కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

హౌరా-చెన్నై మధ్య నడిచే కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో కార్గో బోగి రైల్వే చక్రాలు దగ్గర మంటలు చెలరేగాయి. శుక్రవారం ఉదయం తేలప్రోలు దగ్గర మంటలు రావడంతో లోకో పైలట్ అప్రమత్తమై ట్రైన్‌ను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తేలప్రోలు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. లోకో పైలట్ మంటలను ఆర్పి వేశారు.
News April 25, 2025
కృష్ణా: ఈ ప్రాంతాల ప్రజలు జాగ్రత్త.!

జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నట్లు APSDMA తెలిపింది. శుక్రవారం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే ప్రాంతాలను వెల్లడించింది. బాపులపాడు 40.8°, గన్నవరం 41.2°, గుడివాడ 40.2°, కంకిపాడు 40.7°, నందివాడ 40.1°, పెనమలూరు 40.9°, ఉంగుటూరు 40.9°, పెదపారుపూడి 40.3°, తోట్లవల్లూరు 40°, ఉయ్యూరు 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News April 25, 2025
మోపిదేవి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

కృష్ణా జిల్లా మోపిదేవి వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు.. అవనిగడ్డకు చెందిన యాసాబాల భాస్కర్ (21), బంతుల సుధాకర్ (18) చల్లపల్లి వెళ్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.