News June 21, 2024
మచిలీపట్నం: ఈ నెల 23న పురుషుల హాకీ జట్టు ఎంపిక

నోబుల్ కళాశాలలో ఈ నెల 23న సీనియర్ పురుషుల హాకీ జట్టు ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు కృష్ణా జిల్లా హాకీ సంఘ కార్యదర్శి హరికృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. 1995, జనవరి 1 కంటే ముందు జన్మించిన ఆటగాళ్లు ఎంపిక పోటీలకు ధ్రువపత్రాలతో 23న ఉదయం 8 గంటలకు నోబుల్ కళాశాలకు రావాలని చెప్పారు. ఎంపికైనవారు అంతర్ జిల్లాల పోటీలలో కృష్ణా జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు.
Similar News
News November 22, 2025
కృష్ణా: కార్యాలయ పరిసరాలు శుభ్రం చేసిన కలెక్టర్

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్ ప్రాంగణంలోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు. కలెక్టర్తో పాటు డీపీఓ అరుణ, డీఆర్ఓ చంద్రశేఖరరావు, కలెక్టరేట్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొని చెత్తా చెదారాలను తొలగించారు. వివిధ శాఖల ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఎన్నికల విధులు పట్ల నిర్లక్ష్యం వద్దు… పద్దతి మార్చుకోండి – జేసీ

ఎన్నికల విధులు పట్ల కొన్ని బూత్లెవల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ ధోరణి వెంటనే మారాలంటూ జాయింట్ కలెక్టర్, ముడా ఇంఛార్జి వైస్ ఛైర్మన్, పెడన నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నవీన్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శుక్రవారం పెడన పంక్షన్ హాలులో నిర్వహించిన శిక్షణ–సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెడన నియోజకవర్గానికి చెందిన 217 మంది బీఎల్వోలతో పాటు ఏఈఆర్వోలు పాల్గొన్నారు.