News March 30, 2024

మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి రాజకీయ నేపథ్యం ఇదే..

image

ఎట్టకేలకు మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాలశౌరి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. 2004లో కాంగ్రెస్ నుంచి తెనాలి ఎంపీగా విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ నుంచి నరసరావుపేట ఎంపీగా, 2014లో వైసీపీ తరఫున గుంటూరు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2019లో వైసీపీ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 

Similar News

News September 15, 2025

కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బదిలీ

image

కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న గీతాంజలి శర్మను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ప్రత్యేక శ్రద్ధ చూపిన ఆమె పనితీరు ప్రశంసలు పొందింది. ఇకపై ఫైబర్ నెట్ విస్తరణలో కీలక పాత్ర పోషించనున్నారు. కొత్త జాయింట్ కలెక్టర్‌పై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

News September 15, 2025

కృష్ణా: ఈ నెల 16 పాఠశాల ఫెన్సింగ్ జట్ల ఎంపిక

image

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16న పటమట ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో అండర్-14, 17 బాల, బాలికల ఫెన్సింగ్ జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ స్టడీ సర్టిఫికేట్, జనన ధృవీకరణ పత్రం, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంతకం, సీల్‌తో ఉన్న ఎంట్రీ ఫారం తీసుకురావాలని ఎస్జీఎఫ్ కార్యదర్శులు దుర్గారావు, రాంబాబు తెలిపారు. ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి.

News September 15, 2025

కృష్ణా: 13 మంది ఎంపీడీఓలకు పదోన్నతి

image

కృష్ణా జిల్లాలో నలుగురు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, 9 మంది డిప్యూటీ ఎంపీడీఓలకు ఎంపీడీఓలుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన వారికి జడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక పోస్టింగ్ ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ కన్నమ నాయుడు పాల్గొన్నారు.