News March 30, 2024
మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి రాజకీయ నేపథ్యం ఇదే..
ఎట్టకేలకు మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాలశౌరి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. 2004లో కాంగ్రెస్ నుంచి తెనాలి ఎంపీగా విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ నుంచి నరసరావుపేట ఎంపీగా, 2014లో వైసీపీ తరఫున గుంటూరు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2019లో వైసీపీ నుంచి ఎంపీగా విజయం సాధించారు.
Similar News
News January 25, 2025
పెనమలూరు: బ్యాంక్ ఉద్యోగికి భారీ మోసం
బ్యాంక్‌లో అపార అనుభవం ఉన్న ఓ విశ్రాంత బ్యాంక్ అధికారికి సైబర్ నేరగాళ్లు కళ్లెం వేశారు. పెనమలూరు పోలీసుల వివరాల మేరకు.. తాడిగడపకు చెందిన ఉమామహేశ్వర గుప్తా అనుమతులు లేకుండానే కొందరు వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని చెప్పడంతో ఆయన నమ్మి 9సార్లు రూ.78.33 లక్షలు పంపించారు. తిరిగి అడుగగా వారు స్పందించకపోవడంతో మోసపోయినట్లు గుర్తించారు.
News January 25, 2025
మూడో స్థానంలో కృష్ణా జిల్లా
సాయుధ దళాల పతాక నిధి సేకరణలో కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచిందని జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి సర్జన్ లెఫ్ట్నెంట్ కల్నల్ డాక్టర్ కె. కళ్యాణ వీణ శుక్రవారం తెలిపారు. ఇందుకు సంబంధించి డిసెంబర్‌లో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా మెమెంటో తీసుకోవాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం రద్దు కావడంతో ఆ మెమెంటోను శుక్రవారం కలెక్టర్ డీకే బాలాజీని కలిసి అందజేశారు.
News January 24, 2025
పెనమలూరు: హత్య కేసులో నిందితుడు అరెస్ట్
హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పెనమలూరు పోలీసులు తెలిపారు. సీఐ వెంకట్ రమణ తెలిపిన సమాచారం మేరకు ఈ నెల 9వ తారీఖున పోరంకి ప్రభు నగర్‌కు చెందిన ఉమ్మడి రాణి అనే మహిళను తన అల్లుడైన నారబోయిన నరేశ్ హత్య చేశాడు. ఆప్పటినుంచి పరారీలో ఉన్న నరేశ్‌ను గురువారం రాత్రి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడిని న్యాయమూర్తిగా హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు శుక్రవారం తెలిపారు.