News May 4, 2024

మచిలీపట్నం: జిల్లాలో 144 సెక్షన్ అమలుకు ఉత్తర్వులు జారీ

image

ఈ నెల 13వ తేదీన జిల్లాలో పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో 48 గంటల ముందు 11వ తేదీ నుంచి సెక్షన్ 144 అమలు చేస్తూ కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల మేరకు జిల్లాలో ఎక్కడా కూడా ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుంపులు గుంపులుగా ఉండకూడదన్నారు. అలాగే బహిరంగ సభలు, ర్యాలీలకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. పోలింగ్ ముగిసే వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయన్నారు.

Similar News

News November 8, 2024

కృష్ణా: కొత్త ఓటు నమోదుకు స్పెషల్ క్యాంప్‌లు 

image

జిల్లాలో కొత్తగా ఓటర్ల నమోదు కోసం ఈ నెల 9,10,23,24 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో కోరారు. ఫొటో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన పౌరులందరూ తప్పనిసరిగా తమ ఓటును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలన్నారు. 

News November 8, 2024

కృష్ణా: ఉచిత గ్యాస్ సిలెండర్ల కోసం 1.3లక్షల బుకింగ్‌లు

image

ఉచిత గ్యాస్ సిలెండర్ల కోసం జిల్లాలో ఇప్పటి వరకు 1.3లక్షల మంది బుకింగ్ చేసుకున్నారని, వీరిలో 70 వేల మందికి మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేసినట్టు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఉచిత గ్యాస్ సిలెండర్లు పొందే విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్నా 1967 టోల్ ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. 

News November 7, 2024

పోర్టు పనుల వేగవంతానికి అధిక మొత్తంలో యంత్రాలు: కలెక్టర్

image

బందరు పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అధిక మొత్తంలో అవసరమైన యంత్రాలను ఉపయోగించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పోర్టు నిర్మాణ పనులపై ఆయన సమీక్షించారు. 2025 డిసెంబర్ నాటికి తొలి విడత పనులు పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేయాలన్నారు. పనుల పురోగతిని పరిశీలించేందుకు త్వరలోనే పోర్టు పనుల సందర్శనకు వస్తానన్నారు.