News February 22, 2025
మచిలీపట్నం: జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం

వాహన చోదకులు హెల్మెట్, సీట్ బెల్టు ధరిస్తే చాలావరకు రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని కలెక్టర్ బాలాజీ అన్నారు. శుక్రవారం మచిలీపట్నం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. రోడ్డు ప్రమాదాల స్థితిగతులు, డ్రంక్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్ కేసులు, రహదారులపై బ్లాక్ స్పాట్లకు తీసుకున్న చర్యలు, రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలపై చర్చించారు.
Similar News
News February 23, 2025
కృష్ణా: కేజి చికెన్ ధర ఎంత అంటే.!

మచిలీపట్నం, పెడన పరిసర ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కోడి మాంసం ధరలు భారీగా పడిపోయాయి. కేజీ చికెన్ విత్ స్కిన్ రూ.110, స్కిన్ లెస్ రూ.120గా ఉందని మాంసాహారులు చికెన్ దుకాణాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ పరిస్థితి కారణంగా వ్యాపారాలు పూర్తిగా క్షీణించాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ కిలోల కొద్దీ చికెన్ అమ్ముకునే వారు ఇప్పుడు తక్కువ పరిమాణంలో కూడా అమ్మకాలు సాగడంలేదని వాపోయారు.
News February 23, 2025
కృష్ణా: నానిలు సేఫేనా.?

వల్లభనేని వంశీ అరెస్ట్ తరువాత పేర్ని నాని, కొడాలి నానిని అరెస్ట్ చేస్తారన్న గుసగుసలు విస్తృతంగా వినిపించాయి. కూటమి నాయకులు కూడా పలు సందర్భాల్లో నెక్స్ట్ అరెస్ట్ వారే అని చెప్పారు. ఇది ఇలా ఉండగా మీ అరెస్టులు వల్ల రోమాలు కూడా ఊడవని పేర్ని నాని అన్నారు. మూడు కాకపోతే 30 కేసులు ఉంటాయని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. కాగా వీరన్న మాటలు ఇప్పుడు చర్చినీయాంశంగా మారాయి.
News February 23, 2025
ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలి: కలెక్టర్

ప్రకృతి వ్యవసాయం వల్ల పొందే లాభాలపై రైతులకు అవగాహన కల్పించి వారిని ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన అధికారులు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్) సిబ్బందికి ప్రకృతి వ్యవసాయంపై శనివారం అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంతో పండించే పంటలకు ఉన్న డిమాండ్‌ను రైతులకు తెలియజేయాలని సూచించారు.