News April 29, 2024

మచిలీపట్నం పార్లమెంట్ బరిలో 15 మంది అభ్యర్థులు

image

నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణల అనంతరం మచిలీపట్నం పార్లమెంట్ బరిలో 15 మంది అభ్యర్థులు నిలిచారు. నామినేషన్ల పరిశీలన అనంతరం 25 మంది పోటీలో నిలువగా వారిలో 10 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. YCP అభ్యర్థిగా డా. సింహాద్రి చంద్రశేఖర్, జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లు కృష్ణ, తదితరులు పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Similar News

News December 8, 2025

గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లే ఇండిగో ఫ్లైట్ రద్దు

image

విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లే విజయవాడ-ఢిల్లీ, ఢిల్లీ-VJA ఇండిగో సర్వీసులు సోమవారం రద్దయ్యాయి. మధ్యాహ్నం 2:20 గంటలకు గన్నవరం చేరుకోవాల్సిన విమానం, 2:50 గంటలకు దిల్లీకి బయలుదేరాల్సిన విమానం సాంకేతిక కారణాల వల్ల రద్దు అయినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రయాణికులకు టికెట్ ఛార్జీల రీఫండ్ లేదా రీషెడ్యూల్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులో ఉంచామని ఇండిగో సంస్థ పేర్కొంది.

News December 8, 2025

సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో లొంగిపోయిన మరో నిందితుడు

image

సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో మరో నిందితుడు సోమవారం లొంగిపోయాడు. విజయవాడ పడమట పోలీస్ స్టేషన్‌లో వంశీ ప్రధాన అనుచరుల్లో ఒకరైన కొమ్మకోట్ల లొంగిపోయాడు. ఇదే కేసులో ఇటీవల తేలప్రోలు రాము, వజ్రా కుమార్ లొంగిపోగా, యుర్రంశెట్టి రామాంజనేయులు అరెస్టయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ నేత వల్లభనేని వంశీ గతంలోనే అరెస్ట్ అయ్యారు.

News December 8, 2025

1.82లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం: జేసీ నవీన్

image

కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 1,82,405 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ ఓ ప్రకటనలో తెలిపారు. ధాన్యం సేకరణకు సంబంధించి 29,866 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.502.50 కోట్లు చెల్లించామన్నారు. రైతులు ధాన్యం విక్రయించిన 24 గంటల్లోపే చెల్లింపులు చేస్తున్నామన్నారు. 72,98,622 గోనె సంచులను రైతు సేవా కేంద్రాల వద్ద రైతులకు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.