News April 5, 2025
మచిలీపట్నం: పీజీ సెట్ కోసం KUలో సమాచార కేంద్రం

పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధుల కోసం కృష్ణా విశ్వవిద్యాలయంలో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డా ఎల్. సుశీల తెలిపారు. పీజీ సెట్-2025కు సంబంధించిన నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈనెల 2 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.
Similar News
News April 9, 2025
కృష్ణా: మండలానికి 3 లేదా 4 ఆదర్శ పాఠశాలలు- కలెక్టర్

విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి అంగీకారంతో ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుకు కృషి చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ అధికారులు, ఆర్డీఓతో సంయుక్త సమావేశం నిర్వహించారు. పాఠశాలల పునఃవ్యవస్థీకరణపై ఆయన సమీక్షించారు. మండలానికి కనీసం 3 లేదా 4 ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.
News April 9, 2025
కృష్ణా: ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ(ICDS)లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీలో భాగంగా కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బుధవారం మచిలీపట్నంలోని కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 16 పోస్టుల భర్తీకి ఇటీవల అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ 16 పోస్టులకు 122 మంది దరఖాస్తు చేసుకున్నారు.
News April 9, 2025
రూ.కోటి పనులకు భూమి పూజ చేసిన కలెక్టర్

కృష్ణాజిల్లా మొవ్వలో కోటి రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్, డ్రైనేజీ నిర్మాణ పనులకు కలెక్టర్ బాలాజీ గురువారం ఉదయం భూమి పూజచేశారు. వేద పండితులు వేదమంత్రోచ్ఛారణ పూజా కార్యక్రమాలు నిర్వహించగా కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.