News December 16, 2024

మచిలీపట్నం: పేర్ని నాని ఎక్కడ.!

image

రేషన్ బియ్యం మాయం కేసు నమోదుతో అజ్ఞాతంలోకి వెళ్లిన మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పేర్ని కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు వెతుకులాట మొదలు పెట్టాయి. బందరు మండలం పొట్లపాలెంలో జయసుధ పేరిట పేర్ని గోడౌన్ నిర్మించగా అందులో 185 టన్నుల రేషన్ బియ్యం మాయంపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఆ కుటుంబం తరఫున రూ.కోటి డీడీ తీసి న్యాయవాది ద్వారా సమర్పించారు. 

Similar News

News January 25, 2025

గన్నవరం హైవేపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

image

గన్నవరం జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. 60 సంవత్సరాల వృద్ధుడు రోడ్డు దాటుతుండగా లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో వృద్ధుడు లారీ చక్రాల కిందపడి స్పాట్‌లోనే మృతి చెందాడు. గన్నవరం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 25, 2025

పెనమలూరు: బ్యాంక్ ఉద్యోగికి భారీ మోసం

image

బ్యాంక్‌లో అపార అనుభవం ఉన్న ఓ విశ్రాంత బ్యాంక్ అధికారికి సైబర్ నేరగాళ్లు కళ్లెం వేశారు. పెనమలూరు పోలీసుల వివరాల మేరకు.. తాడిగడపకు చెందిన ఉమామహేశ్వర గుప్తా అనుమతులు లేకుండానే కొందరు వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని చెప్పడంతో ఆయన నమ్మి 9సార్లు రూ.78.33 లక్షలు పంపించారు. తిరిగి అడుగగా వారు స్పందించకపోవడంతో మోసపోయినట్లు గుర్తించారు. 

News January 25, 2025

మూడో స్థానంలో కృష్ణా జిల్లా

image

సాయుధ దళాల పతాక నిధి సేకరణలో కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచిందని జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి సర్జన్ లెఫ్ట్నెంట్ కల్నల్ డాక్టర్ కె. కళ్యాణ వీణ శుక్రవారం తెలిపారు. ఇందుకు సంబంధించి డిసెంబర్‌లో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా మెమెంటో తీసుకోవాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం రద్దు కావడంతో ఆ మెమెంటోను శుక్రవారం కలెక్టర్ డీకే బాలాజీని కలిసి అందజేశారు.