News December 11, 2024
మచిలీపట్నం: పేర్ని నాని సతీమణిపై నమోదైన సెక్షన్లు ఇవే..
మాజీ మంత్రి, వైసీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య (నాని) సతీమణి జయసుధ, ఆయన వ్యక్తిగత కార్యదర్శి మానస తేజపై బందరు తాలుకా PSలో కేసు నమోదైంది. జయసుధ పేరిట ఉన్న గోడౌన్లో 185 టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్టు సివిల్ సప్లయిస్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలుకా పోలీసులు వీరి ఇరువురిపై 316 (3), 316 (5), 61 (2) రెడ్ విత్ 3 (5) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 25, 2025
గన్నవరం హైవేపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్
గన్నవరం జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. 60 సంవత్సరాల వృద్ధుడు రోడ్డు దాటుతుండగా లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో వృద్ధుడు లారీ చక్రాల కిందపడి స్పాట్‌లోనే మృతి చెందాడు. గన్నవరం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 25, 2025
పెనమలూరు: బ్యాంక్ ఉద్యోగికి భారీ మోసం
బ్యాంక్‌లో అపార అనుభవం ఉన్న ఓ విశ్రాంత బ్యాంక్ అధికారికి సైబర్ నేరగాళ్లు కళ్లెం వేశారు. పెనమలూరు పోలీసుల వివరాల మేరకు.. తాడిగడపకు చెందిన ఉమామహేశ్వర గుప్తా అనుమతులు లేకుండానే కొందరు వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని చెప్పడంతో ఆయన నమ్మి 9సార్లు రూ.78.33 లక్షలు పంపించారు. తిరిగి అడుగగా వారు స్పందించకపోవడంతో మోసపోయినట్లు గుర్తించారు.
News January 25, 2025
మూడో స్థానంలో కృష్ణా జిల్లా
సాయుధ దళాల పతాక నిధి సేకరణలో కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచిందని జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి సర్జన్ లెఫ్ట్నెంట్ కల్నల్ డాక్టర్ కె. కళ్యాణ వీణ శుక్రవారం తెలిపారు. ఇందుకు సంబంధించి డిసెంబర్‌లో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా మెమెంటో తీసుకోవాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం రద్దు కావడంతో ఆ మెమెంటోను శుక్రవారం కలెక్టర్ డీకే బాలాజీని కలిసి అందజేశారు.