News January 31, 2025
మచిలీపట్నం: బ్యాంకు ఉద్యోగి భారీ మోసం

కస్టమర్స్ బ్యాంకులో పెట్టిన రూ.1.60 కోట్లు విలువ చేసే గోల్డ్ను రోల్డ్ గోల్డ్ పెట్టి మోసం చేస్తున్న బ్యాంకు ఉద్యోగిపై కేసు నమోదయింది. మచిలీపట్నం పోలీసులు కథనం.. పట్టణంలో ఓ బ్యాంకు ఉద్యోగి సోమశేఖర్ కస్టమర్స్ బ్యాంకులో పెట్టిన గోల్డ్ ప్లేస్లో రోల్డ్ గోల్డ్ పెట్టి ఆ గోల్డ్ను తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చేపట్టారు.
Similar News
News January 6, 2026
ఎరువుల వినియోగంపై అవగాహన అవసరం: కలెక్టర్

ఆరోగ్యకరమైన పంటల సాగుకు రైతులు ఎరువులను విచక్షణతో వినియోగించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ డీ.కే. బాలాజీ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన ధర్తీ మాత బచావో నిగ్రాన సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు అనవసరంగా రసాయన ఎరువులు వాడకుండా నియంత్రించే బాధ్యత వ్యవసాయ శాఖ, వ్యవసాయ శాస్త్రవేత్తలపై ఉందని తెలిపారు.
News January 6, 2026
బండారు దత్తాత్రేయకు గన్నవరంలో ఘన స్వాగతం

హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సోమవారం హైదరాబాద్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు బీజేపీ రాష్ట్ర నేతలు కానూరి శేషు మాదవి, నాదెండ్ల మోహన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం బండారు దత్తాత్రేయ రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు.
News January 6, 2026
కృష్ణా: కోడి పందేల నిషేధంపై కరపత్రల ఆవిష్కరణ

జిల్లాలో కోడి పందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఎక్కడైనా జరిగితే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని కలెక్టర్ డీ.కే.బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఛాంబర్లో ఎస్పీసీఏ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అనంతరం కోడిపందేల నిషేధంపై రూపొందించిన కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు.


