News January 17, 2025
మచిలీపట్నం: మెయిన్స్‌కు 262 మంది క్వాలిఫై
మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో గురువారం కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు పురుష అభ్యర్థులు 390 మంది హాజరయ్యారని జిల్లా SP కార్యాలయం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. వీరిలో 128 మంది డిస్ క్వాలిఫై అయ్యారని పేర్కొంది. 262 మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారని జిల్లా SP కార్యాలయం వివరాలు వెల్లడించింది.
Similar News
News January 17, 2025
VJA: అమిత్‌షా భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయాలి
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన సందర్భంగా భద్రత ఏర్పాట్లపై విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు శుక్రవారం ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 18, 19న జిల్లాలో కేంద్రమంత్రి పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ ఆదేశించారు. సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
News January 17, 2025
జగ్గయ్యపేటలో దారుణ హత్య
జగ్గయ్యపేటలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. జగ్గయ్యపేటకు చెందిన యర్రంశెట్టి ఆంజనేయులు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆంజనేయులు గతంలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్‌గా పని చేశారు. గతంలో ఆయనపై పలు ఫిర్యాదులు రావడంతో సామినేని ఉదయభాను తొలగించారు. ఎన్నికలకు ముందు టీడీపీలో తిరుగుతూ ఉన్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
News January 16, 2025
మానవత్వం చాటుకున్న మంత్రి కొలుసు పార్థసారధి
మంత్రి కొలుసు పార్థసారధి మానవత్వం చాటుకున్నారు. గురువారం ఏలూరు నుంచి విజయవాడకు వెళుతుండగా జాతీయ రహదారిపై కలపరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కోడూరుపాడుకు చెందిన శిరీష, ఆమె తల్లి తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళుతున్న మంత్రి ప్రమాదాన్ని చూసి తన కాన్వాయిని ఆపి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని అధికారులు ఆదేశించారు.