News November 25, 2024
మచిలీపట్నం: రైలు కిందపడి దంపతుల ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి

మచిలీపట్నంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో నిజాంపేటకు చెందిన దంపతులు గోపీకృష్ణ-వాసవి రైలు కిందపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భార్య మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన భర్త ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 2011లో వీరికి వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయినప్పటి నుంచి భార్యతో చిన్న చిన్న గొడవలు ఉండటంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు గోపీకృష్ణ తెలిపాడు.
Similar News
News October 16, 2025
అంగలూరులో రాష్ట్రంలో మొట్టమొదటి బాలికల పాఠశాల

గుడ్లవల్లేరు అంగలూరు గ్రామంలో చల్లపల్లి జమిందార్ జ్ఞాపకార్థంగా బాలికల పాఠశాల ప్రారంభించారు. స్వాతంత్య్రం రాక ముందు బాలికలకు విద్య దూరంగా ఉండేది. దీంతో 1946లో ఈ స్కూల్ ప్రారంభించి బాలికా విద్యకు పునాది వేశారు. జమిందారీ దాతృత్వంతో 96 సంవత్సరాల అద్భుత ప్రయణం సాగుతోంది. రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన బాలికల ప్రభుత్వ పాఠశాలగా గుర్తింపు పొందింది. ఇటీవల జిల్లాస్థాయి స్వచ్ఛ పాఠశాల అవార్డు అందుకుంది.
News October 16, 2025
గన్నవరంలో యాక్సిడెంట్.. స్పాట్ డెడ్

గన్నవరం జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ – ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో బైకుపై ఉన్న వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బాపులపాడు మండలానికి చెందిన గరికిపాటి సుబ్బారావుగా గుర్తించారు. అతను రైల్వే శాఖలో పని చేసి రిటైర్ అయ్యారు. మార్కెట్ నుంచి సరుకులకు తీసుకొని వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.
News October 16, 2025
కృష్ణా: బీరు బాటిళ్ల స్కాన్‌పై మందుబాబుల ఆందోళన.!

కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సురక్ష యాప్’పై వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా యాప్‌లో బీరు బాటిళ్లను స్కాన్ చేస్తే ‘ఇన్వ్యాలిడ్’ అని చూపించడం గమనార్హం. దీనిపై మద్యం తాగేవారు, దుకాణదారులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. యాప్‌లో సాంకేతిక లోపం ఉందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.