News November 25, 2024

మచిలీపట్నం: రైలు కిందపడి దంపతుల ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి

image

మచిలీపట్నంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో నిజాంపేటకు చెందిన దంపతులు గోపీకృష్ణ-వాసవి రైలు కిందపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భార్య మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన భర్త ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 2011లో వీరికి వివాహం కాగా  ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయినప్పటి నుంచి భార్యతో చిన్న చిన్న గొడవలు ఉండటంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు గోపీకృష్ణ తెలిపాడు.

Similar News

News December 3, 2024

విజయవాడలో రెండు దశలుగా మెట్రో రైలు ప్రాజెక్టు 

image

విజయవాడలో 2 దశలుగా మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సూత్రప్రాయంగా నిర్ణయించింది. మొదటి దశలో 2 కారిడార్‌లు, రెండో దశలో మరో కారిడార్ నిర్మాణం చేపట్టేలా రూపొందించిన DPRను కేంద్రానికి పంపనుంది. మొదటి దశలోని కారిడార్ 1Aలో గన్నవరం-పండిట్ నెహ్రూ బస్టాండ్(PNBS), కారిడార్ 1Bలో PNBS- పెనమలూరు, 2వ దశలోని కారిడార్ 3లో PNBS-అమరావతి మధ్య మెట్రో నిర్మించేలా DPR తయారైందని తెలుస్తోంది.

News December 3, 2024

మచిలీపట్నం: ‘ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి’

image

‘ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులను కోరారు. ఈ పథకం అమలుపై జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ పథకం కింద రైతులకు పంట నష్టం జరిగినప్పుడు భీమా మొత్తం అందుతుందని, పథకం ప్రయోజనాలు రైతులకు వివరించి ఆసక్తి గల రైతులందరిని నమోదు చేస్తారన్నారు. 

News December 3, 2024

విజయవాడ మెట్రో ప్రాజెక్టు వ్యయమెంతంటే.!

image

విజయవాడ మెట్రో మొదటి దశలోని కారిడార్ 1Aలో గన్నవరం-పండిట్ నెహ్రూ బస్టాండ్(PNBS), కారిడార్ 1Bలో PNBS- పెనమలూరు మధ్య 38.4 కి.మీ. మేర నిర్మించేలా DPR తయారైంది. దీనికి రూ.11,009కోట్ల వ్యయం అవ్వొచ్చని ప్రభుత్వ అంచనా.1A, 1B కారిడార్‌ల భూసేకరణకు రూ.1,152 కోట్ల వ్యయం రాష్ట్రమే భరిస్తుందని DPRలో పేర్కొంది. కాగా 2వ దశలోని కారిడార్ 3లో PNBS-అమరావతి మధ్య 27.5 కి.మీ. మేర మెట్రో నిర్మించేలా DPR సిద్ధమైంది.